కాలేయ మార్పిడి కోసం సూపర్ అర్జంట్ కేటగిరీ ఉందిగా..!

Urgent Category For Liver Transplants: మారుతున్న జీవన విధానం, తినే ఆహారం, షిఫ్ట్ ల వారీగా చేస్తోన్న ఉద్యోగాల వల్ల ఈరోజుల్లో అనేక హెల్త్ ఇష్యూస్ ను ఫేస్ చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా సడెన్ హార్ట్ ఎటాక్, కిడ్నీలు పాడవ్వడం వంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కాగా తీవ్ర అస్వస్థతకి గురై కాలేయం చెడిపోతే.. ప్రాణం నిలిపేందుకు అత్యవసరంగా లివర్ మార్పిడి చేయాల్సినవసరం ఉంటుంది. ఆ కీలక సమయంలో రోగులకు ‘సూపర్ అర్జెంట్ కేటగిరీ’ అనే విధానం ఎంతో అండగా నిలుస్తోంది. అవయవదానంలో భాగంగా ఈ నిబంధన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేక చాలామంది దీనిని వినియోగించుకోలేకపోతున్నారు.

సేకరణ రెండు రకాలు:
1.అవయవ మార్పిడి అవసరమైనవారికి డోనర్స్ నుంచి రెండు రకాలుగా కలెక్ట్ చేసి అందిస్తుంటారు. జీవన్ దాన్ ట్రస్టు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఇందుకు బ్రెయిన్​డెడ్ అయిన దాతల నుంచి సేకరించడానికే తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు.
రోగి కుటుంబ సభ్యులు గనుక ముందుకొస్తే సగం కాలేయం, ఒక కిడ్నీ సేకరించి మార్పిడి చేసేందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు.

  1. మొదటి కేటగిరీలో అవయవం పొందడానికి కొన్నిసార్లు రెండేళ్ల టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. కిడ్నీలు పాడైతే డయాలసిస్​తో కొంతకాలం వరకూ నెట్టుకురావచ్చు. కాలేయం పాడైతే కొన్నిసార్లు 24 గంటల్లోపే అవయవం మార్పిడి చేయాల్సినవసరం ఉంటుంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కాలేయ మార్పిడి కోసం ‘సూపర్ అర్జెంట్ కేటగిరీ’ కింద ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తున్నారు.
  • వైరల్‌ హెపటైటిస్‌ లాంటి పరిస్థితిలో 15% మందిలో కాలేయం పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది.
  • కొన్ని రకాల క్యాన్సర్లు, ఇన్‌ఫెక్షన్లు వేగంగా వ్యాపించి కాలేయాన్ని దెబ్బతీస్తాయి.
  • రోగిలో కాలేయ వ్యాధి తీవ్రతను అంచనా వేసే ఎంఈఎల్‌డీ స్కోరు 35 దాటితే లివర్‌ పని చేయదు. పైన చెప్పిన ఈ మూడు సందర్భాల్లోనూ సూపర్‌ అర్జెంట్‌ కేటగిరీని వర్తింపజేయవచ్చు.

లివర్ సిరోసిస్.. లివర్ అనేది చాలా మెత్తగా సెన్సిటివ్ గా ఉండే ఆర్గాన్. ఇన్​ఫ్లమేషన్ ఏర్పడినప్పుడు లివర్ ఉబ్బిపోతుంది. అదే పరిస్థితి లాంగ్ రన్ లో కొనసాగితే రక్తకణాలు దెబ్బతిని, కాలేయం రాయిలా, గట్టిగా మారిపోతుంది. దీంతో అది చేయాల్సిన పనులు చేయలేకపోతుంది. ఈ పరిస్థితినే లివర్ సిరోసిస్ గా చెబుతారు. అయితే ఇది మొదలైనప్పుడు శరీరంలో లక్షణాలు పెద్దగా కనిపించవు. గుర్తించలేం కూడా. Urgent Category For Liver Transplants.

  • ఏదైనా సమస్య తీవ్రం అవుతున్నకొద్దీ త్వరగా అలసిపోవటం, ఆకలి తగ్గటం, చర్మం పాలిపోవడం, దురదగా అనిపించడం, కమిలిపోవడం, మూత్రం ముదురు రంగులోకి మారడం, కడుపు, కాళ్లు ఉబ్బడం, కొందరికి వికారంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మెదడు మొద్దుబారొచ్చు. మతిమరుపు ఆరంభం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Also Read: https://www.mega9tv.com/life-style/do-you-use-glass-bottles-at-home-what-does-the-latest-survey-says/