తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన పలువురు దళిత నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు తమకు ఎంతో నచ్చాయని, కాబట్టి ఆయనతో ప్రయాణం చేస్తామని వారు తెలిపారు. ఎంతోమంది పేద ప్రజలకు సహకారాలు చేస్తూ ఎక్కువగా దళితులకు ఎంతగానో ఆదుకున్నారన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఎప్పుడు ఎలాంటి ఆపదల వచ్చిన నేరుగా తనతో చెప్పుకోమని కంబాల శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.