Heavy rainfall for andhra pradesh
ఏపీకి భారీ వర్షాల ముప్పు..
ఈ జిల్లాలకు అలర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, అనకాపల్లి, అరకు, పాడేరు, విశాఖ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తాయని అధికారులు తెలిపారు. పంటలపైనా ప్రభావం ఉంటుంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు , తీర ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు.