మిడిల్ ఈస్ట్ పరిస్థితుల కారణంగా ఇంధన కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. ఎల్పీజీ కొరత లేదని పేర్కొంది. దేశీయంగా ఎల్పీజీ ప్రొడక్షన్ 30 శాతం పెరిగినట్లు తెలిపింది. ఆందోళన అవసరం లేదని పునరుద్ఘాటించింది. ఈమేరకు పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. ప్రస్తుతం గ్యాస్ డిమాండ్ లో భారీ తేడా కనిపిస్తోందని అవసరం లేకపోయినప్పటికీ ఆందోళనలతో బుకింగ్స్ చేయవద్దని సూచించారు. యుద్ధానికి ముందు రోజుకు 55.7 లక్షల సిలిండర్లు బుక్ అయ్యేవని అయితే ప్రస్తుతం సంఖ్య అమాంతం 75.7 లక్షలకు పెరిగింది. ముందస్తు ఆందోళనతో బుకింగ్స్ పెరుగుతున్నాయని అర్ధమవుతోంది. ప్రజలకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు.