ఈనెల 21న రంజాన్ సెలవు..ప్రభుత్వం ఉత్తర్వులు 

Spread the love

రంజాన్ సందర్భంగా ఈ నెల 21న సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం గత  అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం మొదట  జారీ చేసిన సాధారణ సెలవుల జాబితా ప్రకారం 20వ తేదీన రంజాన్ సెలవుగా నిర్ణయించారు. అయితే నెల వంక కనిపించడం బేస్ చేసుకుని రంజాన్ పండగ రేపు వస్తుందని రాష్ట్ర వక్స్ బోర్డు సీఈఓ నుండి  ప్రభుత్వానికి లేఖ అందింది. దీంతో 21వ తేదీ సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రేపు  నిర్వహించాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ ఎగ్జామ్ ను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. గవర్నమెంటు ఎగ్జామ్  విభాగం మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నేడు  ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే మొదట 20వ తేదీన రంజాన్ సెలవుగా నిర్ణయించడంతో ఆంగ్ల పరీక్షను రేపు  నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా రంజాన్ సెలవు రేపటికి  మారడంతో..ఇంగ్లీష్ ఎగ్జామ్ ను అన్ని ఎగ్జామ్స్ పూర్తయ్యాక ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *