త్రిసూర్ లోని శ్రీభద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్’ అనే రోబో ఏనుగును అందజేసినట్లు పెటా తెలిపింది. కేరళలోని దేవాలయానికి పెటా ఇండియా-అనితా డోంగ్రే ఫౌండేషన్ కలిసి భారీ రోబోటిక్ ఏనుగును అందించారు. మలయాళ కొత్త సంవత్సరమైన విషు వేడుకల సందర్భంగా భక్తుల సమక్షంలో దీనిని ఆవిష్కరించినట్లు తెలిపింది. కేరళ వ్యాప్తంగా వివిధ ఆలయాలకు పెటా అందించిన రోబోటిక్ ఏనుగుల్లో ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్’ 14వది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ ఆలయాలకు 25 రోబోటిక్ ఏనుగులను బహుమతిగా అందించినట్లు పెటా తెలిపింది. ఇక ఈ రోబోటిక్ ఏనుగులు చూడడానికి నిజమైన ఏనుగుల మాదిరిగానే ఉన్నాయి. అవి తమ తొండాన్ని పైకి ఎత్తగలవు, చెవులను మరియు కళ్లను తిప్పగలవు, తల ఊపగలవు మరియు చక్రాల ఆధారిత బేస్ మీద కదలగలవు.