తెలంగాణ రైజింగ్‌ కు ప్రధాని పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం మాకుంది

Spread the love

వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి దేశంలో గ్రోత్ ఇంజన్లుగా ఉన్న 6 ప్రధాన మహానగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత కలిగిన అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సత్వర అనుమతులు లభించేలా ప్రధానమంత్రి కార్యాలయం లో ప్రత్యేకంగా సింగిల్ విండో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని  కోరారు.తెలంగాణలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ, తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో కలిసి సీఎం  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశర రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, 2047 వికసిత్ భారత్  లక్ష్యాలను చేరుకోవడానికి తెలంగాణ కూడా తనవంతు భాగస్వామ్యం అందిస్తుందని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా తెలంగాణాలో కూడా #TelanganaRising2047 లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుకు వెళుతోందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.  కేంద్ర ప్రభుత్వంతో కలిసి పయనించాలని తెలంగాణ ఆకాంక్షిస్తోంది. తెలంగాణకు సంబంధించి రీజినల్ రింగ్ రోడ్డు, #MetroRail, మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ – మచిలీపట్నం వ‌ర‌కు 12 వ‌రుస‌ల ర‌హ‌దారికి సంబంధించి ప్రతిపాదనలు ప్రధానికి  గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం మరియు ప్రజల కోసం ప్రాజెక్టుల విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిసిన సందర్భాన్ని గుర్తుచేశారు. వాటన్నింటినీ సానుకూలంగా పరిశీలించాలని కోరారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపాలని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని  వికసిత్ భారత్ 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఏ లక్ష్యాల కోసం మోదీ గారు కలగంటున్నారో అందుకు అనుగుణంగా తెలంగాణ నుంచి దేశ జీడీపీకి 10 శాతం వాటా అందించాలని నిర్దేశించాం. తెలంగాణ రైజింగ్‌కు మీరు పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం ఉందని సీఎం రేవంత్  అన్నారు. కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, సంజ‌య్ మంచి మిత్రులని అన్న రేవంత్  ప్రధాని మోడీకి పెద్ద మ‌న‌స్సు ఉంద‌ని తెలంగాణకు తెలుసని తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప‌నులు, ప్రతిపాదనలు అన్నింటినీ ఆమోదిస్తారని ప్ర‌జ‌లు ఆశిస్తున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *