తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవిని ఇప్పటివరకు చూడని కొత్త ప్రపంచంలో, కొత్త తరహా పాత్రలో చూపించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా ఫాంటసీ, అడ్వెంచర్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్ అన్ని కలగలిపిన ఒక భారీ రేంజ్ లో ఈ సినిమా రూపొందుతోందన్నట్లు తెలుస్తోంది.
అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్స్ పెద్దగా బయటకు రాకపోవడంతోనెట్టింట కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఎక్కడ వరకు వచ్చింది? సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? కథ ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరో పెద్ద ప్రచారం కూడా మొదలైంది. అదేంటంటే… ‘విశ్వంభర’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్న నేపథ్యంలో దర్శకుడి నుండి పరోక్షంగా స్పష్టత వచ్చేసింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో రెండు భాగాల ట్రెండ్ ఎంతగా నడుస్తుందో తెలిసిందే. ఒక భారీ కథను రెండు లేదా మూడు భాగాలుగా తెరకెక్కించడం ఇప్పుడు సాధారణమైపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా ఈ ఫార్మాట్‌ను ఫాలో అవుతున్నాయి. దీంతో ‘విశ్వంభర’ కూడా రెండు భాగాలుగా రాబోతోందనే ఊహాగానాలు వినిపించాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు వశిష్ఠ స్వయంగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టుపై ఆయన సరదాగా స్పందించారు. “అవునా… నిజమా?” అంటూ నవ్వుతున్న ఎమోజీలను జోడించారు. దీంతో ఈ రూమర్స్ కు ఆయన పరోక్షంగా చెక్ పెట్టినట్టైంది. అంటే ‘విశ్వంభర’ రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగంగా విడుదల కానుందని స్పష్టత వచ్చినట్టుగా అభిమానులు భావిస్తున్నారు. ఇక ‘విశ్వంభర’లో మాత్రం ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని సరికొత్తగా చూపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
