భారత్ లో టాప్ కలెక్షన్స్ అందుకున్న హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్..!

Spread the love

భారత్ లో హాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. తాజాగా విడుదలైన మార్వెల్ నుండి  వచ్చిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమా భారత్ లో భారీ  రికార్డు సృష్టించింది. జూలై 30, 2026న విడుదలైన ఈ చిత్రం, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్-1 హాలీవుడ్ సినిమాగా నిలిచింది. తొలి రెండు వారాల్లోనే ఈ సినిమా ఇక్కడ రూ. 415 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు, అలాగే దాదాపు రూ. 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ లో హాలీవుడ్ సినిమాలు భారీ హిట్స్ అందుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలకు  భారీ క్రేజ్ ఉంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఈ సూపర్ హీరో మూవీస్ ను ఎంతగానో ఇష్టపడతారు. మార్వెల్ స్టూడియోస్ నుండి  వచ్చిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సరిగ్గా ఈ అంచనాలను అందుకుంది.ఇంగ్లీష్‌తో పాటు, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదలైంది. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం భారతదేశంలో 415 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్లను సాధించింది. అలాగే, గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే, దాదాపు 500 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇది ఒక అద్భుతమైన విజయం. ఇంకో విషయం ఏంటంటే, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రాన్ని దాటి మరి మన దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాగా ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ నిలిచింది. అసలు 400 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన మొదటి హాలీవుడ్ చిత్రం కూడా ఇదే అంటున్నారు. ఈ చిత్రం జూలై 30న విడుదలైన తొలి రోజే 60.60 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లతో చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ చిత్రాలలో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ ఇది అని తెలుస్తోంది. తొలి వీకెండ్ లోనే  300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన మొట్టమొదటి హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. గతంలో 1994లో వచ్చిన ‘జురాసిక్ పార్క్’ మొదలు ఎన్నో భారీ హిట్స్ అందుకున్నాయి.  2019లో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ కూడా భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇక 2022లో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ 477.50 కోట్ల రూపాయల గ్రాస్‌తో రికార్డు సృష్టించింది. అయితే, ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కేవలం 11 రోజుల్లోనే ఈ రికార్డులన్నింటినీ అధిగమించి, భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా అధికారికంగా నిలిచింది. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాగే  మార్వెల్ బ్రాండ్‌కు ఉన్న భారీ ప్రజాదరణ. టామ్ హాలండ్, జెండయా, జాకబ్ బటలాన్, జాన్ బెర్న్తాల్, మరియు సాడీ సింక్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా చిత్ర విజయానికి దోహదపడింది. ఈ సినిమా కథనం, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *