ఈసారి థియేటర్లలో అదరగొట్టనున్న మీర్జాపూర్ 

Spread the love

ఓటీటీ వేదికగా చరిత్ర సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్, ఇప్పుడు ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, మాస్ యాక్షన్ డైలాగ్‌లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ చిత్రం, భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రానుంది. ఈ పరిణామం భారతీయ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతోంది. గత కొన్నేళ్లుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు విపరీతంగా పెరిగిపోయాయి, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో థియేటర్లు మూసివేయబడినప్పుడు, ఓటీటీ కంటెంట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది కేవలం వినోద మాధ్యమంలోనే కాకుండా, కంటెంట్ పంపిణీలో కూడా ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. ‘మీర్జాపూర్’ వంటి సిరీస్‌లు, వాటికున్న విశేష ప్రజాదరణ కారణంగా, ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి. మాఫియా, రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. దీనికి కొనసాగింపుగా 2020లో  రెండో సీజన్ విడుదలై, కేభారీ వ్యూస్ తో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించింది. 2024న మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ సిరీస్ విజయానికి కీలక కారణాలలో ఒకటి, మిర్జాపూర్‌లోని నేరపూరిత వాతావరణాన్ని, అధికార పోరాటాలను, కుటుంబ కలహాలను రియలిస్టిక్ గా  చూపించడం. ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రసిక దుగల్ వంటి నటుల అద్భుతమైన నటన, బలమైన కథాంశం దీని విజయానికి ముఖ్య కారణాలు. ఇక విక్రాంత్ మాస్సే మొదటి సీజన్ లో బాబ్లూ పండిట్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు మరో స్థాయిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల నుండి  వెబ్ సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ తోనే దీన్ని సినిమాగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.  2018లో మొదటి సీజన్ విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులు ఈ సిరీస్ ను బాగా ఆదరించారు. అమెజాన్ ప్రైమ్ దీనిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళింది. అలాగే సినిమా ప్రకటన వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *