ఆయన ఒక మాజీ మంత్రి…!!

Spread the love

ఆయన ఒక మాజీ మంత్రి.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి జడ్పీ చైర్మన్గా పని చేశారు. నోరు ఉంది కదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడటమే ఆయన స్టైల్..రాజకీయాలలో ఎదుటి వారి వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ సొంత పార్టీలోనీ నాయకులకు.. కార్యకర్తలకు చులకనగా మారాడని ప్రచారం జరుగుతుంది. ఆయన తీసుకున్న గుంతలో ఆయనే పడ్డట్టు అక్రమ మైనింగ్ కేసులో ఇరుక్కుని దాదాపు 50 రోజుల నుండి అజ్ఞాతంలో ఉన్నాడు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి..?ఆయన కథేంటి…లెట్స్ వాచ్ థిస్ ఆఫ్ ది రికార్డ్

పెద్దారెడ్లకు పెట్టింది పేరుగా పిలిచే నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. మాజీ మంత్రిగా… ఎమ్మెల్యేగా..జడ్పీ చైర్మన్ గా జిల్లా ప్రజలకు సుపరిచితుడే. అయితే ఆయన నోటికి ఉన్న దురద అంతా ఇంతా కాదు మరి. అందుకే ఆయన తీసుకున్న గుంతలో ఆయనే పడ్డట్లు చేసిందని సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు చర్చించుకోవడం విశేషం. జకీయాలలో ఎదుటి వాళ్ళ తప్పులను ఎత్తిచూపటంలో ఎలాంటి తప్పులేదు కానీ..వాళ్ల వ్యక్తిగత విషయాలలో వేలు పెట్టి లేనిపోని ఆరోపణలు చేసి చివరికి తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లు తయారైంది కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి.

అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 50 రోజుల నుండి ఏమైపోయారో ఎవరికీ తెలియదు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ప్రత్యేకంగా ఐదారు టీంలు ఏర్పాటు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం గాలిస్తున్నారట. అటు బెంగళూరు..హైదరాబాద్.. చెన్నై నగరాలతో పాటు ఢిల్లీతో పాటు ఏకంగా శ్రీలంక దేశంలో కూడా ప్రత్యేక బృందాలు వెళ్లి కాకాని కోసం వేట కొనసాగిస్తున్నాయంట. అక్రమ మైనింగ్ కేసులో కాకాని పేరు చేర్చినప్పుడు రండి అరెస్టు చేసుకోండి తానేమి భయపడేవాడిని కాదని… జైలుకైనా పోతానని తగ్గేదే లేదు అని మహా బిల్డప్ ఇచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి …ఇప్పుడు ఏమైపోయారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. సవాళ్లు విసిరి తీరా పోలీసులు విచారణకు పిలిచే సమయానికి తుస్సు మని మాయమైపోయారు. అటు హైకోర్టులో ఇటు సుప్రీంకోర్టులో కాకానికి బెయిల్ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది.అయినప్పటికీ పోలీసులకు మాత్రం లొంగిపోకపోవడం విశేషం. ఓ పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరులపై కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కొంత మంది జైలుకు కూడా వెళ్లారు. మరి కొంతమంది బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే కాకానికి మాత్రం హైకోర్టు సుప్రీంకోర్టు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఇక తమ నాయకుడు ఊచలు లెక్కపెట్టక తప్పదేమో అని వైసిపి నాయకులు గుసగుసలాడుకుంటున్నారట.

మైనింగ్ కేసులో దమ్ముంటే పోలీసులు అరెస్టు చేసుకోవాలని నానా హంగామా చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గత 50 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో జిల్లా వైసీపీ పార్టీ అయోమయంలో ఉందట. జిల్లాలో పార్టీని ముందుండి నడిపించాల్సిన తమ నాయకుడు ఇలా కనిపించకపోవడం ఏమిటంటూ ద్వితీయ..తృతీయ శ్రేణి నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారట. జిల్లాలో పార్టీని మోసే నాయకుడు ఎవరు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. దీంతో నెల్లూరు జిల్లాలో షరామాములుగా వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు అధిష్టానాన్ని ఆదుకునే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి . ఇప్పుడు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి పోవడంతో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు జిల్లాకి దిక్కయ్యారు. ప్రెస్ మీట్ పెట్టాలన్న..అధికార పార్టీపై విరుచుకుపడాలన్నా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మాత్రమే బయటకు వస్తున్నారు. జిల్లాలోని మిగతా మాజీలంతా ఏమైపోయారో అర్థం కాని పరిస్థితి నెలపొందట.

కాకాని గోవర్ధన్ రెడ్డికే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక తమ పరిస్థితి ఏమిటంటూ మిగతా మాజీలంతా సైలెంట్ అయిపోయారట. దీంతో అధిష్టానం ఒత్తిడి మేరకు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్ని తానై భుజస్కందాలపై నెల్లూరు జిల్లాలో వైసిపి పార్టీని మోస్తున్నారట. మరోపక్క వైసీపీ మరో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా పైలాన్ ధ్వంసం చేసిన కేసులో బెయిల్ పై తిరుగుతున్నారు. ఇక త్వరలో ముఖ్యమైన నాయకుడును కూడా పోలీసులు అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక గోవర్ధన్ రెడ్డికి అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టులో బెయిల్ విషయంలో ఎదురుదెబ్బ తగలడంతో ఏ నిమిషంలోనైనా కోర్టులో సరెండర్ అవుతారని ప్రచారం కూడా జరుగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి పై అక్రమ మైనింగ్ కేసు..పేలుడు పదార్థాలు ఉపయోగించాడు అనే కేసు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు.. మాజీ మంత్రి సోమిరెడ్డి పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసు ఇలా దాదాపు పది కేసులు పైగానే ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి గాని పోలీసులకు దొరికినా కోర్టులో లొంగిపోయినా దాదాపు మూడు నుంచి ఐదు నెలలు జైల్లో ఉండే అవకాశాలు ఉన్నాయని నెల్లూరు జిల్లాలో ప్రచారం కూడా జరుగుతుంది.

కాకాని గోవర్ధన్ రెడ్డి 50 రోజుల నుండి అజ్ఞాతంలో ఉండడంతో మాజీమంత్రి టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశాంతంగా నిద్రపోతున్నారట. నిద్రలేచింది మొదలు సోమిరెడ్డిపై కాకాణి సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలతో ..అసభ్యకర పదజాలంతో ప్రతిరోజు విరుచుకుపడేవారు. దీంతో ప్రస్తుతం కాకాని అజ్ఞాతంలోకి పోవడంతో సోమిరెడ్డి ప్రశాంతంగా ఉన్నాడని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. కాకాని అజ్ఞాతంలోకి వెళ్లడంతో ప్రస్తుతం సోమిరెడ్డి కూడా కాకానిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.. అంత అన్నావు ఇంత అన్నావు తీరా చూస్తే ఏ ఎక్కడో దాక్కున్నావు కాకాని అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. దేశంలో టెర్రరిస్టులు కూడా దొరుకుతున్నారని కానీకాకాని మాత్రం దొరకటం లేదని సోమిరెడ్డి ఎద్దేవా చేస్తున్నారు.