ఒకవైపు భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్ లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మేమేం తక్కువ కాదు అంటూ ఇటు అమ్మాయిల జట్టు కూడా సత్తా చాటారు. భారత మహిళల హాకీ జట్టు ప్రపంచ కప్‌లో తమ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ డ్రా కావడంతో, టీమిండియా తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. ఈ ప్రదర్శన దేశంలో హాకీ పట్ల ఆసక్తిని, అంచనాలను పెంచుతోంది. సలీమా టెటె నేతృత్వంలోని తొలి రౌండు దాటింది. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన తన పూల్ చివరి మ్యాచ్ లో భారత హాకీ మహిళల జట్టు 0-0తో డ్రాగా ముగించారు. మొత్తం 5 పాయింట్లతో భారత్ పూల్-డిలో రెండో స్థానంతో ముందంజ వేసింది. ఒక మ్యాచ్ లో గెలిచినా ఆ టీమ్ రెండు మ్యాచ్ లను డ్రా చేసుకుంది. మరోవైపు 5-1తో సౌతాఫ్రికాను ఓడించిన చైనా 7 పాయింట్లతో అగ్రస్థానంతో రెండో రౌండ్ కి అర్హత సాధించింది. ఇంగ్లాండ్ పై బరిలోకి దిగిన భారత్ ఆరు పెనాల్టీ కార్నర్లు సంపాదించి ఒక్క దాన్ని కూడా గోల్ గా చేయలేదు. దీపిక, నవ్‌నీత్ కౌర్ అవకాశాలను వృథా చేశారు. కానీ గోల్ కీపర్ సవిత పునియా, బిచ్చు దేవి మంచి ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ముఖ్యమైన సేవ్ లు చేశారు. ఇంగ్లాండ్ 11 పెనాల్టీ కార్నర్ లు సాధించి కూడా స్కోర్ చేయలేకపోయింది.రెండు టీమ్ లు ఒత్తిడిని ఎదుర్కొన్నట్లే కనిపించాయి. డిఫెన్స్ పైనే ఎక్కువగా ఆధారపడ్డాయి. ఇంగ్లాండ్ వ్యూహాలను, ప్రయత్నాలను భారత డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. భారత్, చైనా జట్లు చెరో పాయింట్‌ను రెండో రౌండ్ కు తీసుకెళ్తాయి. చైనాతో మ్యాచ్ భారత్ 2-2తో డ్రాగా ముగించిన విషయం విదితమే. పూల్-ఎ నుంచి నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా.. పూల్-బి నుంచి అర్జెంటీనా, జర్మనీ రెండో రౌండ్లోకి దూసుకెళ్లాయి.