పాకిస్తాన్ చేసిన పనికి భారత్ కూడా అదే స్థాయిలో బదులిచ్చింది. ఇస్లామాబాద్ లో భారత హై కమీషన్ వద్ద పాకిస్తాన్ వ్యవహరించిన దానికి న్యూఢిల్లీలో కూడా అటువంటి రెస్పాన్స్ ఇచ్చింది. భారత హై కమీషన్ వద్ద ఉన్న బారికేడ్లను అక్కడి అధికారులు తొలగించారు. భారత హైకమిషన్ వద్ద పార్కింగ్ ను కూడా తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఇక దీంతో భారత్ కూడా తనదైన శైలిలో స్పందించింది. ఇక్కడ పాక్ కమీషన్ ఎదుట అనుమతుల్లేని కట్టడాలను అధికారులు తొలగించారు. వివిధ చోట్ల ఉన్న బారికేడ్లు, మెటల్ ఫెన్సింగ్స్, షెడ్లు జేసీబీతో అధికారులు తొలగించారు. పాకిస్తాన్ కమీషన్ కాంపౌండ్ దాటి ఉన్న వాటిని తొలగించినట్లు తెలుస్తోంది. ఈ తాజా ఘటనకు మూడు రోజుల క్రితం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ముందు పాకిస్తాన్ అధికారులు పార్కింగ్ స్తంభాలు, భద్రతా బారికేడ్లను తొలగించడమే ప్రధాన కారణం. దీనిని రహదారి విస్తరణ ప్రాజెక్టులో భాగంగా చేశామని పాకిస్తాన్ పేర్కొంది. దానికి ప్రతిగా, ఆగస్టు 20, 2026, బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలో భారత అధికారులు పాకిస్తాన్ హైకమిషన్ వెలుపల ఉన్న అనధికారిక కట్టడాలను కూల్చివేశారు. ఈ నిర్మాణాలలో బారికేడ్లు, ట్రాఫిక్ బోలార్డ్‌లు, మెటల్ ఫెన్సింగ్‌లు, షెడ్‌లు, వీసా విభాగం దగ్గర ఏర్పాటు చేసిన క్యూ-మేనేజ్‌మెంట్ నిర్మాణాలు ఉన్నాయి. ఇవి హైకమిషన్ ప్రాంగణం యొక్క అనుమతించిన సరిహద్దుకు వెలుపల ఉన్నాయని, స్థానిక మునిసిపల్ నిబంధనల ఉల్లంఘన అని భారత అధికారులు తెలిపారు. దౌత్య కార్యాలయ ప్రాంగణాలకు వెలుపల ఉన్న నిర్మాణాలు హోస్ట్ దేశం యొక్క చట్టాలకు లోబడి ఉంటాయని అంతర్జాతీయ నిబంధనలు సూచిస్తున్నాయి. గతేడాది పహల్గామ్ లో భారత టూరిస్ట్ లపై టెర్రరిస్టుల దారి తదనంతరం ‘ఆపరేషన్ సింధూర్’ తో పాక్ లోని టెర్రరిస్టు స్థావరాలను కూల్చివేసి వారిని మట్టుబెట్టడం సింధు జలాల వివాదం ఇలా రెండు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దౌత్య కార్యాలయం వద్ద పాక్ వ్యవహరించిన తీరు కూడా సరికాదని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.