రోబో రన్నింగ్ రేసు రికార్డు: మనిషిని మించిన రోబో వేగం!

Spread the love

తనదైన ముద్ర వేస్తోంది. తాజాగా ఒక రోబో సృష్టించిన రికార్డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు సినిమాల్లో, సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే చూసిన రోబోలు ఇప్పుడు నిజ జీవితంలో మన పక్కనే నడుస్తున్నాయి. మనుషులు చేయలేని పనులను కూడా సునాయాసంగా చేస్తూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. ఇటీవల బీజింగ్‌లో జరిగిన ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో క్రీడల్లో ఒక రోబో సృష్టించిన రికార్డు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక క్రీడా రికార్డు మాత్రమే కాదు, మానవ జాతి భవిష్యత్తులో సాంకేతికత పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పే ఒక సంకేతంగా సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్పీడ్ కు మారుపేరుగా చెప్పుకునే జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ రన్ ను 9.58 సెకన్లలో పూర్తి చేసి 2009లో సృష్టించిన రికార్డు చెక్కుచెదరలేదు. ఎవరూ ఛేదించని అసాధ్యంగా మారిన ఈ వేగాన్ని రోబో  అధిగమించి వార్తల్లో నిలిచింది. బీజింగ్ లో జరిగిన ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో క్రీడల 100 మీటర్ల పరుగును ఒక రోబో 9.39 సెకన్లలోనే పూర్తి చేసింది. ఈ రోబో  బీజింగ్ హ్యూమనాయిడ్ రోబో ఇన్నోవేషన్ సెంటర్ తయారు చేసింది. ఈ రేసులో మరో రోబో 9.47 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. గత ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో క్రీడల కంటే ఈసారి 100 మీటర్లలో ప్రదర్శన ఎంతో మెరుగైంది. పోయినసారి  ఈ 100 మీటర్ల రేసును టియాన్గాంగ్ అల్ట్రా తయారు చేసిన రోబో 21.50 సెకన్లలో పూర్తి చేయగలిగింది. ఇంతకుముందు చైనాకు చెందిన షెన్జెన్ హనర్స్ కంపెనీ రూపొందించిన ‘ఫ్లాష్’ అనే రోబో హాఫ్ మారథాన్లో 50 నిమిషాల 26 సెకన్లలోనే టార్గెట్ చేరింది.  

మనిషి కన్నా వేగంగా పరుగెత్తే రోబోలు, మనుషులు చేయలేని పనులను సులభంగా చేసే రోబోలు ఇప్పుడు నిజమవుతున్నాయి. బీజింగ్ హ్యూమనాయిడ్ రోబో ఇన్నోవేషన్ సెంటర్ మరియు షెన్‌జెన్ ఆనర్స్ స్మార్ట్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ కో లిమిటెడ్ వంటి సంస్థలు ఈ రోబోటిక్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో రోబోలు కేవలం ఇలా రన్నింగ్ రేసులోనే  కాదు, ఇతర క్రీడల్లోనూ, పారిశ్రామిక రంగంలోనూ, అంతరిక్ష పరిశోధనల్లోనూ కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా, రోబోలు మానవ సామర్థ్యాలను అధిగమిస్తున్న ఈ దశలో, వాటిని ఎలా వినియోగించుకోవాలి, వాటితో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై విస్తృత చర్చ జరగాలి. మానవ శ్రమను తగ్గించడంలో, ప్రమాదకరమైన పనులను చేయడంలో రోబోలు గొప్పగా దోహదపడగలవు. రోబోల అభివృద్ధి సామాన్య ప్రజల జీవితాలపై కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా, ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా రంగాల్లో రోబోల వినియోగం పెరగనుంది. రోబోలను మానవ జీవితంలో ఒక భాగంగా స్వీకరించడానికి సమాజం సిద్ధంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  టెక్నాలజీ డెవలప్మెంట్  అనేది ఒక నిరంతర ప్రక్రియ. రోబోలు మనిషి వేగాన్ని అధిగమించడం అనేది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే దశాబ్దాల్లో మనం ఊహించని ఎన్నో అద్భుతాలను రోబోలు సృష్టించనున్నాయి. హ్యూమనాయిడ్ రోబోల పరిశోధన, అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. మానవాళికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ సాంకేతికతను ముందుకు తీసుకెళ్లడం అందరి బాధ్యత. భవిష్యత్తులో రోబోలు మానవ  జీవితంలో భాగంగా మారనున్నాయి.  దీనికి తగ్గట్టుగా మనం సిద్ధంగా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *