బాలీవుడ్ లో మొదలైన ఒక చిన్నకమర్షియల్ యాడ్ లో డ్రెస్సింగ్ వివాదం.. ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. ఎక్కడో ఒక జ్యువెలరీ యాడ్‌లో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ వేసుకున్న బట్టల గురించి మొదలైన ఈ ట్రోలింగ్.. ఏకంగా బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ కంగనా రనౌత్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల మధ్య ఒక డిజిటల్ వార్‌గా మారిపోయింది. ముందుగా ఈ వివాదం మొదలైందిరక్షాబంధన్ పండుగ సందర్భంగా కృతి సనన్ ఒక యాడ్‌లో నటించింది. ఆ వీడియోలో ఆమె ఒక ఇండో-వెస్ట్రన్ అవుట్ ఫిట్ వేసుకుని, తన సోదరుడికి , తన పెంపుడు కుక్కకు రాఖీ కట్టింది. అయితే ఆమె వేసుకున్న ఆ డ్రెస్ చూసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం స్టార్ట్ చేశారు. పవిత్రమైన రాఖీ పండుగ రోజు.. అన్న ముందు అలాంటి బట్టలు వేసుకుని రాఖీ కట్టడం ఏంటి? అసలు ఇది మన సంప్రదాయమేనా? నీ బట్టలు బాలేవు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. దీనిపై కృతి సనన్ కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మహిళలు ఏం వేసుకోవాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారు? సంస్కృతి, సంప్రదాయాలు అనేవి మహిళల మనసులో ఉంటాయి కానీ, ఆమె వేసుకునే బట్టల నెక్-లైన్ లో కాదు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. సరిగ్గా ఇక్కడే ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చింది బీజేపీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ( . కృతి సనన్ బట్టల మీద ఆమె ఏకిపారేస్తూ ఒక ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. కంగనా ఏమందంటే.. ఇది మహిళలకు ఒక అద్భుతమైన కాలం. మనకు వేసుకోవడానికి ఎన్నో వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయి. చీరలు, సల్వార్ కమీజ్, జీన్స్, కాక్ టెయిల్ డ్రెస్సులు.. ఇలా ఎన్నో ఉన్నప్పుడు.. పండుగ రోజు నీ తమ్ముడికి ఇలాంటివి వేసుకుని ఎందుకు రాఖీ కడుతున్నావు? ఈ యాడ్ కావాలనే అసహ్యంగా, ఇంటెన్షనల్ గా తీసినట్లు ఉంది అంటూ కంగనా తనదైన స్టైల్లో కృతిని కడిగిపారేసింది.
అయితే కంగనా ఎంట్రీతో ఇది కాస్తా ఒక పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. కంగనా ఎప్పుడైతే ఈ కామెంట్స్ చేసిందో.. వెంటనే కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కృతి సనన్ కు మద్దతుగా రంగంలోకి దిగాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ.. ఒక మహిళ ఏం వేసుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలి అనేది పూర్తిగా ఆమె ఇష్టం . మహిళలు తమ స్వేచ్ఛను అనుభవిస్తుంటే వాళ్ళను ట్రోల్ చేయడం ఇకనైనా ఆపండి అంటూ రాహుల్ గాంధీ ఒక పోస్ట్ పెట్టాడు. దానికి తోడుగా పురుషాధిక్యతను బద్దలు కొడదాం అనే ఒక పవర్ఫుల్ హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశాడు. నిజానికి రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం పూణేలో జరిగిన ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమంలో కూడా ఈ పితృస్వామ్య వ్యవస్థ గురించే మాట్లాడాడు. మహిళలు స్వేచ్ఛగా బతకాలి, వాళ్ళను పురుషులు కంట్రోల్ చేసే వాతావరణం పోవాలి అని పిలుపునిచ్చాడు. అంతే.. రాహుల్ పెట్టిన ఆ ఒక్క పోస్ట్‌తో, ఒక జ్యువెలరీ యాడ్ వివాదం కాస్తా జాతీయ రాజకీయాల స్థాయికి వెళ్లిపోయింది. రాహుల్ గాంధీ ఎప్పుడైతే పురుషాధిక్యతను బద్దలు కొడదాం అన్నాడో.. వెంటనే బీజేపీ అధికారిక హ్యాండిల్ పోస్ట్ చేసిన ఒక సెటైరికల్ మీమ్ ను కంగనా తన స్టోరీలో షేర్ చేసింది. ఆ మీమ్‌లో ఏముంది అంటే.. రాహుల్ గాంధీ ఒక యువతి దగ్గరకు వెళ్లి మనం పురుషాధిక్యతను బద్దలు కొడదాం అని స్లోగన్ ఇస్తాడు. దానికి ఆ యువతి ఆగు బ్రో .. ముందు భారత్ మాతా కీ జై తో మొదలుపెడదాం అంటుంది. అయినా రాహుల్ వినకుండా పదే పదే అదే మాట అంటుంటే.. ఆ యువతి వరుసగా కాంగ్రెస్ కు కొన్ని గట్టి ప్రశ్నలు వేస్తుంది. మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడే మీరు.. ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు సంగతి ఏంటో చెప్పండి? ట్రిపుల్ తలాక్ రద్దును మీరెందుకు వ్యతిరేకించారు? షా బానో కేసులో కాంగ్రెస్ ఎందుకు మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తించింది? కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కనీసం ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? అంటూ ఆ యువతి రాహుల్ ను కడిగేస్తున్నట్లుగా ఉన్న ఆ మీమ్‌ను కంగనా షేర్ చేసింది. మొత్తం మీద చూసుకుంటే, ఒక సాధారణ అడ్వర్టైజ్మెంట్ డ్రెస్సింగ్ వివాదం.. చివరికి జాతీయ స్థాయిలో ఫెమినిజం ,రాజకీయాల చర్చకు దారి తీసింది. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో సంప్రదాయాలను కించపరచకూడదని ఒక వర్గం అంటుంటే.. బట్టలను బట్టి క్యారెక్టర్ ను , ఒక మహిళా సంస్కృతిని డిసైడ్ చేయడం ఏంటని మరో వర్గం వాదిస్తోంది. మరి ఈ వివాదంలో ఇంకెన్ని మలుపులు ఉంటాయో వేచి చూడాలి. అయితే సదరు జ్యూవెలరీ సంస్థ ఈ యాడ్ ను డిలీట్ చేసింది.