‘కాకా’లో కదిరి కాళిదాస్ గా పవర్ ఫుల్ పాత్రలో మెగాస్టార్

Spread the love

మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కాకా’ ఈ సినిమాని బాబీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇక  కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి చిరు ఒక ఇంటరెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో కదిరి కాళిదాస్ గా కనిపించనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ టీజర్లో ఆయన పాత్రను సత్యంగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో పేరును బయట పెట్టడంతో ఇందులో తను రెండు కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నట్లు తెలుస్తోంది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే మంచి పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా  అలరించనుంది. 

ప్రస్తుతం చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఆక్వా ఫ్యాక్టరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్లింప్స్‌లో చిరంజీవి మాస్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సాధారణ కార్మికుడిగా కనిపిస్తూనే, మరోవైపు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సందడి చేయనున్నాయి. తెలుగు తెరపై మాస్ సినిమాలకు అసలు సిసలు చిరునామా మెగాస్టార్ చిరంజీవి, ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై  టాలీవుడ్ సర్కిల్స్‌ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా సంక్రాంతి పండగ బరిలో నిలిచే ఇతర చిత్రాలతో గట్టి పోటీని ఇస్తూ, ఈ సినిమా కలెక్షన్ల పరంగా కొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. గతేడాది సంక్రాంతి పండుగకు వచ్చి  ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో భారీ హిట్ ను అందుకుంది.  ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇటీవల సెట్స్ నుండి బిహైండ్ ది  సీన్స్ కు కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ వంటి సీనియర్ స్టార్ హీరోతో సినిమా కావడంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తోంది. సంక్రాంతి బరిలో ప్రతి ఏటా భారీ చిత్రాలు విడుదల కావడం టాలీవుడ్‌లో అనవాయితీగా వస్తోంది. అయితే, సరిగ్గా జనవరి 13న వస్తున్న కాకా సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా దర్శకుడు బాబీ రాసుకున్న డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఈ చిత్రం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ను  అందిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *