వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నంబర్ 47 – AK47) నుండి తాజాగా విడుదల చేసిన ‘నారాయణమ్మ’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. నివేదా పేతురాజ్, స్పెషల్ సాంగ్ లో డింపుల్ హయాతీ కనిపించనున్నారు. నారా రోహిత్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్. థమన్ అందిస్తుండగా, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా వెంకటేష్ తో పలు సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు టీవిలో టెలికాస్ట్ అయితే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఈ సినిమాల రేంజ్ లోనే ఈ ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నంబర్ 47 – AK47) కూడా భారీ విజయాన్ని అందుకుటుందనే అంచనాలున్నాయి.
విక్టరీ వెంకటేష్, తన డైలాగ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే తెలుగు ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం నెలకొంటుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నంబర్ 47 – AK47). తొలి ప్రకటన నుంచే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా, ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ‘నారాయణమ్మ’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. యూట్యూబ్‌తో పాటు అన్ని ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ పాట విశేష ప్రజాదరణ పొందుతోంది. కేవలం విడుదలైన కొద్ది సమయంలోనే 30 లక్షలకు పైగా వ్యూస్ సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంగీత సంచలనం ఎస్. థమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. త్రివిక్రమ్- థమన్ కాంబినేషన్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. మరోసారి వీరిద్దరూ మ్యూజిక్ మ్యాజిక్‌తో అదిరే ఆల్బమ్‌ను అందిస్తున్నారని ఈ పాట తాజా విజయంతో నిరూపితమైంది.ఈ సినిమాలో వెంకటేష్ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ తెరపై సరికొత్త ఫ్రెష్‌నెస్‌ను, తీసుకొచ్చింది. ఇప్పటికే వచ్చిన ప్రచార వీడియోల్లో అది కనిపించింది. మరో ప్రధాన పాత్రలో నివేదా పేతురాజ్ నటిస్తుండగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే మాస్ స్పెషల్ సాంగ్ లో అందాల భామ డింపుల్ హయాతీ కనిపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించే నారా రోహిత్ ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అలాగే సీనియర్ నటుడు రావు రమేష్ నటన, వెన్నెల కిషోర్ మార్కు కామెడీ టైమింగ్ అలరించనున్నాయి. ఆకట్టుకునే కథాంశం, త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్, వెంకటేష్ టైమింగ్ కలగలిసి థియేటర్లలో ప్రేక్షకులకు మళ్లీ ఒక క్లాసిక్ అనుభూతిని అందించబోతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.