మహేష్‌ కోసం.. ఆ ముగ్గురు..?

Spread the love

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ఈ క్రేజీ కాంబినేషన్లో భారీ, క్రేజీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. జక్కన్న తన సినిమా కథ ఏంటి అనేది క్లియర్ గా చెప్పి షూటింగ్ స్టార్ట్ చేస్తుంటారు. అయితే.. ఈసారి రూటు మార్చి ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మహేష్‌ నెక్ట్స్ మూవీ కోసం ముగ్గురు దర్శకులు కథలు రెడీ చేశారని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. మహేష్ నెక్ట్స్ ఏంటి..? మహేష్‌ కోసం కథలు రెడీ చేసిన ఆ ముగ్గురు దర్శకులు ఎవరు..?

మహేష్‌ నెక్ట్స్ మూవీ బుచ్చిబాబుతో అంటూ ఈమధ్య ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి మహేష్ తదుపరి చిత్రం ఎవరితో అనేది హాట్ టాపిక్ అయ్యింది. మహేష్‌ బాబుతో సుకుమార్ వన్ నేనొక్కడినే అనే సినిమా తీసినప్పుడు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అప్పటి నుంచి మహేష్‌ తో బుచ్చిబాబుకు పరిచయం ఉంది. ఉప్పెన సినిమా తర్వాత మహేష్ బాబు, బుచ్చిబాబు కలిసి సినిమా చేయాలి అనుకున్నారట. పెద్ది తర్వాత మహేష్‌ తో సినిమా చేయడం కోసం బుచ్చిబాబు ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారని సమాచారం.

ఇక మహేష్‌ కోసం కథ రెడీ చేసిన మరో డైరెక్టర్ ఎవరంటే.. సందీప్ రెడ్డి వంగ. అసలు యానిమల్ మూవీని మహేష్‌ బాబుతో చేయాలి. సందీప్ రెడ్డి వంగ ఈ కథ చెబితే మరీ అంత యాక్షన్, వయోలెన్స్ ఉంటే.. చూడరని.. తనకు సెట్ కాదనే ఉద్దేశ్యంతో నో చెప్పాడట. అయితే.. మరో కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామని మహేష్‌ ఆఫర్ ఇచ్చారట. ఈసారి మహేష్‌ తో సినిమా చేయాలని సందీప్ గట్టిగా ఫిక్స్ అయ్యాడని తెలిసింది. స్పిరిట్ తర్వాత మహేష్‌ బాబుతో సందీప్ సినిమా ఖాయమని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మ‌రో వైపు నాగ్ అశ్విన్ కూడా మ‌హేష్ బాబు కోసం ఓ క‌థ రెడీ చేస్తున్నాడ‌న్న‌ది ఇన్ సైడ్ న్యూస్. వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే.. ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరి కథకు మ‌హేష్ ఓకే చెబుతాడు అనేది ప్రస్తుతానికి స‌స్పెన్స్‌. దీని పై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.