రూ.1000 కోట్ల కంపెనీకి24 ఏళ్లకు సీఈఓ

ఉన్నత చదువులు చదివి ఫారెన్ కంట్రీస్‎లో హై ఫై జాబ్స్ చేసే చాలా మంది భారతీయులు సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ మధ్యకాలంలో బిజినెస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారికి తెలిసిన రంగాల్లో తమ నైపుణ్యాన్ని ఉపయోగించి రాణిస్తున్నారు..యంగ్ ఏజ్‎లోనే ఎవరూ ఊహించలేని విజయాలను సాధిస్తున్నారు. ఇందులో కొందరి జర్నీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంటే…మరికొందికి వ్యాపారాలు వారసత్వంగా వస్తున్నాయి.. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు దేవిత సరఫ్. 24 ఏళ్ల వయసులో ఆమె స్థాపించిన సంస్థ ఇప్పుడు వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించే కంపెనీగా అవతరించింది. ప్రపంచంలోనే సెల్ఫ్ మేడ్ కోటీశ్వరుల్లో ఒకరిగా దేవిత నిలిచేలా చేసింది. ఇంతకీ ఈ సీఈఓ ఎవరు? ఆమె బిజినెస్ బ్యాగ్రౌండ్ ఏంటి? ఇంత చిన్న వయస్సులోనే సీఈఓగా ఎలా ఎదిగారు? ఈ సక్సెస్ జర్నీలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. దేవిత సరఫ్ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం పదండి.

దేవిత సరాఫ్ సొంతూరు ముంబై. ఆమె తండ్రి జెనిత్ కంప్యూటర్స్ ఛైర్మన్‌ రాజ్‌కుమార్ సరాఫ్. ఆమె స్కూలింగ్ అంతా ముంబైలోనే సాగింది. హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ తీసుకున్నాక.. కాలిఫోర్నియాలోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఏ పట్టా పుచ్చుకుంది. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చేసింది. దేవితకు చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలన్న ఆసక్తి ఎక్కువ అందుకే తన స్టడీ పూర్తికాగానే తన తండ్రి గైడెన్స్ తో వ్యాపారం వైపు అడుగులు వేసింది. 24 ఏళ్లలోనే టీవీలను తయారు చేసే కంపెనీని స్టార్ట్ చేసింది.

దేవిత 2006లో తన 24 ఏళ్ల వయసులో Vu పేరుతో టెలివిజన్‌ సంస్థను స్థాపించింది. ఇది LED TVలు, ఇతర టెలివిజన్‌లను తయారు చేసే ఇండియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. వియు కంపెనీ టీవీలను కేవలం భారతదేశంలో మాత్రమే కాదు..ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాల్లో విక్రయిస్తోంది. అయితే మనదేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధికంగా అమ్ముడవుతున్న టీవీ బ్రాండ్‌గా వియు అవతరించింది. కంపెనీ అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన దేవితను ఫార్చ్యూన్ ఇండియా 2019లో భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ఒకరుగా ప్రకటించింది.

ప్రపంచంలోనే సెల్ఫ్ మేడ్ కోటీశ్వరుల్లో దేవిత ఒకరు. అయితే ఈ విజయం ఆమెకు అంత ఈజీగా రాలేదు. ఆమె తన ఆలోచనను లాభదాయకమైన వ్యాపారంగా మార్చడానికి చాలా సంవత్సరాలు ఎదురుచూసింది. కంపెనీ మొదటి 8 సంవత్సరాలలో కేవలం 30 కోట్ల వ్యాపారం చేసింది. ఆ తర్వాత 4 సంవత్సరాలలో ఎవరూ ఊహించని విధంగా సంస్థ బాగా పుంజుకుంది. ఇవాళ ఈ సంస్థ విలువ ఏకంగా 1000 కోట్లకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *