ఇవాళ బందరులోని తన ఇంటిపై దాడికి జనసైనికులు ప్రయత్నించడంపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు.పవన్ ఉడత ఊపుళ్లకు బెదిరేది లేదన్నారు. సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా సిద్ధాంతం లేకుండా మాట్లాడారని పేర్ని తెలిపారు. కులం లేదు మతం లేదు అని, హిందువులందరిని రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలకు, మతాలను రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ ని మీడియా సాక్షిగా ఎండ కట్టానని తెలిపారు. బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యతలు లేకుండా ప్రవర్తించటం సిగ్గుమాలిన పని కాదా అని ప్రశ్నించారు. నిన్న మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకొని కార్యకర్తలను తన ఇంటి పైకి తీసుకువచ్చారన్నారు. ఇలాంటి చర్యలకు పేని నాని ,వైసీపీ భయపడదన్నారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అని పేర్ని తెలిపారు.