తిరుపతి శ్రీతాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో వైసీపీ నేతలు భూమన కరుణాకరరెడ్డి, గురుమూర్తి పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేసినట్లు భూమన తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బ తెసేలా అనరాని మాటలు అన్నారని, నెయ్యికు బదులుగా జంతువుల కొవ్వు వాడారనే అపవాదు వేశారని భూమన ఆరోపించారు. సాక్షాత్తు ముఖ్య మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు వాఖ్యలు చేసారన్నారు. ఆలయ పవిత్ర మంట కలిపే విధంగా వ్యవహరించారని, అందుకే చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశామన్నారు.