కూలీ తెరపైకి రావడం వెనుక ఇంత జరిగిందా?

Spread the love

Coolie Release on August 14: కూలీ కూలీ కూలీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ఈమధ్య కాలంలో ఏ సినిమాకి రానంత బజ్ ఈ మూవీకి క్రియేట్ అయ్యింది. ఆగష్టు 14న కూలీ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం వెనుక పెద్ద కథ ఉందనే విషయం బయటకు వచ్చింది. ఇంతకీ.. కూలీ మూవీ ఎలా సెట్ అయ్యింది..? తెర వెనుక ఏం జరిగింది..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.

ఒక్కోసారి ప్రాజెక్టులు చాలా విచిత్రంగా సెట్ అవుతుంటాయి. అలా సెట్ అయ్యిందే కూలీ కూడా అనుకోవచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే.. లోకేష్ కనకరాజ్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయాలనే డ్రీమ్ ఉందట. మూడేళ్లుగా రజినీతో సినిమా చేయడం కోసం ట్రై చేస్తున్నాడట కానీ.. సెట్ కావడం లేదట. మాస్టర్, విక్రమ్, లియో.. ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ సినిమాలు చేస్తున్నాడు కానీ.. రజినీతో మూవీ కుదరడం లేదట. ఓసారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ తో మాట్లాడుతూ.. రజినీతో సినిమా చేయాలనే తన మనసులో మాటను చెప్పాడట. అంతే కాకుండా అనిరుథ్ కి కథ కూడా చెప్పాడట.

లోకేష్‌ చెప్పిన స్టోరీ వినగానే ఇంప్రెస్ అయిన అనిరుథ్ వెంటనే.. రజినీకాంత్, లోకేష్‌ కనకరాజ్ కు మధ్య మీటింగ్ ఏర్పాటు చేశాడట. లోకేష్‌ చెప్పిన స్టోరీ విన్న రజినీకి బాగా నచ్చేసిందట. పైగా అప్పటికే లోకేష్‌ కనకరాజ్ వరుసగా సక్సెస్ సాధించి ఉండడంతో ఎలాంటి డౌట్ లేకుండా ఓకే చెప్పారట. అప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి సన్ పిక్చర్స్ రావడం చక చకా జరిగిపోయింది. అనిరుథ్ చొరవ తీసుకోకపోతే.. కూలీ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్ అయ్యేది కాదు. ఇలా కూలీ సినిమా సెట్ అవ్వడం వెనుక అనిరుథ్ ఉన్నాడని తెలిసింది. ఇదేదో పుకారో.. గాసిప్పో అనుకుంటే పొరపాటే. ఈ విషయాన్ని స్వయంగా అనిరుథ్ బయటపెట్టాడు. సో.. ఇది నిజంగా నిజం. Coolie Release on August 14.

కూలీ క్రేజ్ విషయానికి వస్తే.. మామూలుగా లేదు. ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా టిక్కెట్లు సేల్ అయ్యాయి. ప్రీ సేల్స్ లోనే 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం అనిపిస్తుంది. తమిళనాడులోనో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పాన్ ఇండియా వైజ్.. ఓవర్ సీస్ లో కూడా భారీగా క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాని పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేయడంతో జనాలకు బాగా రీచ్ అయ్యింది. అందుకనే ఊహించిన దాని కంటే ఎక్కువుగా బజ్ క్రియేట్ అయ్యింది. ఆగష్టు 14న కూలీ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. మరి.. కూలీ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/akira-nandan-debut-movie-these-top-two-movie-banners-are-planning-a-movie-with-him/