వీళ్లకు ఏమైంది..?

Spread the love

Indian Employees: భారతీయులు ఎక్కువగా ఇతర దేశాల్లో ఉద్యోగం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఫారెన్ కి వెళ్లి జాబ్ చేసి లక్షలు లక్షలు సంపాధించాలని అనుకుంటారు. కానీ అందులోనూ అమెరికా అంటే మన వాళ్లు ఎగిరిగంతేస్తారు. ఎప్పుడెప్పుడు సప్త సముద్రాలు దాటి వెళ్ధామా..? అని ఎదురుచూస్తుంటారు. అలాంటి ఇండియన్స్ కు నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ వేసినట్లు.. హెచ్ 1 బీ వీసా నిబంధనలతో గట్టే స్ట్రోక్ ఇచ్చాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీంతో విద్యార్థులతోపాటు ఉద్యోగుల కాళ్లకు సంకేళ్లు వేసినంత పనైంది. అలా అని భారత్ లో బతకలేం అన్నట్లు కాదు.. కానీ కొంత మంది అమెరికా వద్దు అంటోందని.. ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇంతకీ ఏయే దేశాల పౌరసత్వంపై వారు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు..? పెట్టుబడి ప్రాతిపదికన పౌరసత్వాన్ని ఏయే దేశాలు ఇస్తున్నాయి..? పౌరసత్వం మంజూరుకు కఠినమైన రూల్స్‌ను అమలుచేస్తున్న దేశాలేవి..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భారత ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లతో పోల్చుకుంటే.. చాలా బాగా పెరిగింది. ఇలాంటి తరుణంలో చాలా మంది భారతీయులు స్వదేశానికే జై కొడుతున్నారు. అయితే కొందరు హై నెట్‌ వర్త్ వ్యక్తులు బిలియనీర్లు, విద్యార్థులు, పరిశోధకులు మాత్రం ప్రత్యామ్నాయాలు, అభివృద్ధి అవకాశాలు, కెరీర్ పురోగతి కోసం విదేశాల వైపు ఆశగా చూస్తున్నారు. పౌరసత్వం మంజూరుకు పలు దేశాలు కఠినమైన ప్రాసెస్‌ను పెట్టినా, భారీ పెట్టుబడుల షరతులు విధించినా లెక్క చేయకుండా ఎంతోమంది భారతీయ హెచ్‌ఎన్‌ఐలు అప్లై చేసుకుంటున్నారు.

బిలియనీర్ల కు సంపదను, వ్యాపారాన్ని పెంచుకోవాలనే లక్ష్యం ఉంటుంది. వీలైనంత ఎక్కువ ట్యాక్స్‌ను ఆదా చేసుకోవాలని వారు భావిస్తారు. పౌరసత్వంతో పాటు ఈ ప్రయోజనాలన్నీ ఇచ్చే దేశాల కోసం సంపన్నులు అన్వేషిస్తున్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన వెంటనే ఉద్యోగంతో పాటు పౌరసత్వం ఇచ్చే దేశాల కోసం విద్యార్థులు వెతుకుతున్నారు. కేవలం సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితం కోసం ఎంతోమంది సంపన్నులు, వ్యాపారులు పలు దేశాల పౌరసత్వాన్ని కోరుకుంటున్నారు. భారత సర్కారు ఒకే వ్యక్తికి రెండు పౌరసత్వాలను మంజూరు చేయదు. అందుకే ‘హై నెట్‌వర్త్ వ్యక్తులు’ భారత పౌరసత్వాన్ని వదులుకొని, తమకు నచ్చిన దేశాలకు వెళ్లిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలో అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, పోర్చుగల్, గ్రీస్, స్పెయిన్, మాల్టా, గల్ఫ్ దేశాలకు హై ప్రయారిటీ ఇస్తున్నారు.

గత ఐదేళ్లుగా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఈ విషయం సాక్షాత్తూ భారత ప్రభుత్వ అధికారిక నివేదికల్లో వెల్లడైంది. సులభంగా పౌరసత్వాన్ని మంజూరు చేస్తున్నందు వల్లే ఈ దేశాలకు వెళ్లిపోయేందుకు భారతీయ హెచ్‌ఎన్‌ఐలు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా ఏదైనా దేశ పౌరసత్వం కావాలంటే అక్కడ కనీసం ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల పాటు నివసించాలి. అయితే పలు దేశాలు పెట్టుబడులు పెట్టే వాళ్లకు కొన్ని నెలల్లోనే పౌరసత్వాన్ని మంజూరు చేస్తున్నాయి. ఈ జాబితాలోకి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, యాంటిగ్వా, డొమినికా, మాల్టా లాంటి దేశాలు వస్తాయి. సిటిజెన్‌షిప్ బై ఇన్వెస్ట్‌ మెంట్ స్కీంను ఈ దేశాలు అమలు చేస్తున్నాయి. పెట్టుబడి లేదా విరాళం ఇచ్చిన వారికి పౌరసత్వం కేటాయిస్తున్నాయి.

పోర్చుగల్, గ్రీస్, స్పెయిన్, మాల్టా, యూఏఈ లాంటి దేశాలు గోల్డెన్ వీసాలను ఇస్తున్నాయి. ఆయా దేశాల్లోని రియల్ ఎస్టేట్, ఇతరత్రా ఫండ్‌లలో నిర్దిష్ట పెట్టుబడి పెడితే కొన్నేళ్ల పాటు నివాస అనుమతులు మంజూరు చేస్తారు. తదుపరిగా దేశ పౌరసత్వాన్ని కేటాయిస్తారు. కెనడా, ఆస్ట్రేలియా, యూకేల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయులకు వర్క్ పర్మిట్లు ఈజీగా మంజూరు అవుతున్నాయి. అనంతరం వారికి పర్మినెంట్ రెసిడెన్సీని, చివరగా పాస్‌పోర్టును మంజూరు చేస్తున్నారు. పలు దేశాల పౌరసత్వం మంజూరైతే వీసా లేకుండానే దాదాపు 100 నుంచి 150 దేశాలకు రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది.

యూఏఈ దేశం సరికొత్త నామినేషన్ ఆధారిత వీసా పాలసీని తీసుకొచ్చింది. దీని ద్వారా భారతీయులు రూ.25 లక్షలను చెల్లించి యూఏఈలో జీవితకాల నివాస అనుమతి కోసం దరఖాస్తు చేయొచ్చు. టర్కీ పౌరసత్వం కోసం ఆ దేశ రియల్ ఎస్టేట్‌లో 3.54 కోట్ల రూపాయాల పెట్టుబడి పెట్టాలి. లేదంటే అక్కడి బాండ్లు, ఫండ్లు, డిపాజిట్లలో 4.50 కోట్ల రూపాయాల పెట్టుబడిని పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడిని కనీసం మూడేళ్లు కంటిన్యూ చేస్తేనే పౌరసత్వం కోసం అర్హత లభిస్తుంది. దాదాపు 6 నుంచి 8 నెలల్లో పౌరసత్వం మంజూరయ్యే అవకాశాలు ఉంటాయి.

గ్రెనడా పౌరసత్వం కోసం ఆ దేశ నేషనల్ ట్రాన్స్‌ఫామేషన్ ఫండ్‌కు రూ.2 కోట్ల విరాళం ఇవ్వాలి. లేదంటే అక్కడి ప్రభుత్వం ఆమోదించిన రియల్ ఎస్టేట్‌లో 2.39 కోట్ల రూపాయాల పెట్టుబడి పెట్టాలి. పౌరసత్వం మంజూరుకు 4 నుంచి 6 నెలల టైం పడుతుంది.

సెయింట్ లూసియా పౌరసత్వం కోసం ఆ దేశ రియల్ ఎస్టేట్, బాండ్లలో 2.12 కోట్ల రూపాయాల పెట్టుబడి పెట్టాలి. పౌరసత్వం మంజూరుకు 6 నుంచి యాంటిగ్వా బార్బుడా పౌరసత్వం కోసం ఆ దేశ రియల్ ఎస్టేట్ సహా పలు రంగాల్లో 2 కోట్ల నుంచి 2.60 కోట్ల రూపాయాల దాకా పెట్టుబడి పెట్టాలి. పౌరసత్వం మంజూరుకు 3 నుంచి 6 నెలల టైం పడుతుంది.

వనౌతు పౌరసత్వం కోసం 1.15 కోట్ల రూపాయాలను అక్కడి ప్రభుత్వానికి అధికారికంగా విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే అక్కడి రియల్ ఎస్టేట్‌లో ఇంకా పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. విరాళం ఇచ్చే వారికి 2 నుంచి 3 నెలల్లోపే పౌరసత్వం మంజూరవుతుంది. Indian Employees.

మాల్టా పౌరసత్వం కోసం 7.25 కోట్ల రూపాయాలను ఆ దేశంలో పెట్టుబడి పెట్టాలి. అక్కడ ఏదైనా ఆస్తిని కొనాలి. లేదంటే ప్రాపర్టీని అద్దెకు తీసుకోవాలి. తొలుత కొన్నేళ్ల కోసం నివాస అనుమతిని మంజూరు చేస్తారు. శాశ్వత పౌరసత్వం లభించాలంటే 12 నుంచి 36 నెలల పాటు వేచిచూడాల్సిందే.