
Balayya’s Akhanda 2: టాలీవుడ్లో అత్యంత విజయవంతమైన మాస్ కాంబినేషన్‌గా బాలకృష్ణ, బోయపాటి శ్రీను పేరు ముందుంటుంది. వీరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఇప్పుడు ఈ హిట్ జోడి నాలుగోసారి ‘అఖండ 2’తో రాబోతుండగా, అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. బోయపాటి సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బాలయ్యతో ఆయన చేసే చిత్రాలు ఎమోషన్, డివోషనల్ నేపథ్యాన్ని కలిపిన ఆధ్యాత్మిక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా నిలుస్తాయి.
ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో రికార్డులు: రిలీజ్‌కు ముందే లాభాల్లోకి
వాస్తవానికి ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉన్నా, షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. చివరకు, డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో, ‘అఖండ 2’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సంచలనం సృష్టిస్తోంది. నాన్-థియేట్రికల్ హక్కులు కళ్లు చెదిరే ధర పలికాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జియో హాట్‌స్టార్ ఐదు భాషలకు కలిపి ఓటీటీ హక్కులను రికార్డు స్థాయిలో రూ. 104 కోట్లకు దక్కించుకుందట. స్టార్ టీవీ అన్ని భాషల్లో కలిపి రూ.60 కోట్లకు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. మ్యూజిక్ హక్కులు రూ. 8 కోట్లు పలికాయి. అలా మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ పరంగా చూసుకుంటే నిర్మాతలకు నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ. 172 కోట్ల భారీ టేబుల్ ప్రాఫిట్ వచ్చింది.
దీనికి అదనంగా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది:
సీడెడ్ ప్రాంతంలో రూ. 24 కోట్లు.
నైజాంలో రూ. 30 కోట్లు.
ఆంధ్రలో సుమారు రూ. 55 కోట్లు.
మొత్తంగా, థియేట్రికల్ + నాన్-థియేట్రికల్ హక్కులు కలిపి ‘అఖండ 2’ రూ. 318 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం విడుదలకు ముందే లాభాల్లోకి అడుగుపెట్టిందని, పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్‌కి కలెక్షన్ల సునామీ ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Balayya’s Akhanda 2 ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ‘అఖండ’ చిత్రంలో సౌండ్ బాక్సులు పగిలిపోయేలా బీజీఎం అందించిన థమన్, ‘అఖండ 2’ కోసం అంతకుమించి అనే స్థాయిలో పనిచేస్తున్నారట. బాలయ్య ఎలివేషన్స్ కోసం ఈసారి సంస్కృత శ్లోకాలు, వేద మంత్రాలు చెప్పడంలో నిపుణులైన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదర ద్వయాన్ని రంగంలోకి దించారు. మొత్తంగా అఖండ 2 లో బాలయ్యను ఈసారి మరింత పవర్ ఫుల్ మాస్ అవతార్‌లో బోయపాటి చూపించబోతున్నారని సమాచారం