
West Bengal Politics: పశ్చిమా బెంగాల్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఏం జరిగిన ఇట్టే దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే .. అక్కడి పార్టీలు ఏమంటున్నాయి..? దీదీ వ్యూహాం ఏంటి..? బీజేపీ ఈ సారి పాగా వేస్తుందా..? 2026 లో బెంగాల్ గడ్డపై ఏ పార్టీ గాలీ వీచనుంది..? అనేది ఈ స్టోరీలో చూద్దాం.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరగా సాగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రజలకు ఓ సెంటిమెంట్ ఉంది. తమకు నచ్చితే ఆ పార్టీని నెత్తిన పెట్టుకుంటారు. అదే నచ్చకపోతే అంతే వేగంగా దించేస్తారు. ఇందుకు 150 ఎళ్ల రాజకీయమే నిదర్శనం. ఈ రాష్ట్రంలో 30 ఏళ్లుగా కమ్యూనిస్టు పార్టీని గెలుపిస్తూ వచ్చిన బెంగాలీలు.. ఆ తర్వాత మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 14 ఏళ్లుగా ఇక్కడ మమతా పార్టీ పాలన సాగుతోంది. క్రమంగా కమ్యూనిస్టులు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నారు. బీజేపీ మాత్రం తమ బలాన్ని పెంచుకుంది.2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, కమలం పార్టీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ ఎన్నికల్లో అంచనాలను మించి దీదీ రాణిస్తే.. గెలుస్తుందనుకున్న బీజేపీ మాత్రం అక్కడే ఆగిపోయింది. ఎంతో రాజకీయ పేరు ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రం వచ్చింది శూన్యం. 2026 ఎన్నికల్ల గెలిచి తీరాలన్న పట్టుదలన టీఎంసీ – బీజేపీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోసారి తమ సత్తా చాటుకోవాలని మమతా పార్టీ తపన. ఎలాగైనా ఈ సారి గెలిచి తీరాలన్న కసి బీజేపీది.
బెంగాల్ లో గత 14 ఏళ్లుగా మమతా బెనర్జీ హవానే నడుస్తోంది. అయితే ఆమె చేసిన సంక్షేమం సంగతా అటుంచితే.. అక్కడ ఆమె పేరే ఒక బ్రాండ్ అని చెప్పాలి. ఆమె మాటలతోనే ప్రత్యర్థులను మట్టి కరిపించగల సత్తా ఆమెకుంది. కానీ.. ఆమె హయంలో జరిగిన అభివృద్ధి మాత్రం కొంతే. మౌళిక సదుపాయాలకు బాగానే ఖర్చు చేశారు. సంక్షేమానికి కొదవ లేదు. కన్య స్త్రీ పేరిట బాలికలకు నెలకు 2వేల 500 రూపాయాలు సాయం చేయ్యడం ప్లస్ పాయింట్. లక్ష్మీ బండార్ కింద మహిళలకు నెలకు వెయ్యి రూపాయాలను అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకు 15 వందల రూపాయాలను అందిస్తున్నారు. ఇలా మహిళల మనసు గెలిచారు. అయితే రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం అనే సమస్యలు ఉన్నాయి. అయితే టీఎంసీ ప్రభుత్వం.. క్రిషక్ బంధు ద్వారా నెలకు ఎకరాకు 5వేల చొప్పున ఇస్తున్నారు. ఈ పథకం రెండు ఎకరాలు,అంతకంటే తక్కువ ఉన్నవారికే.. చనిపోయిన రైతు కుటుంబానికి రెండు లక్షలు ఇస్తూ అండగా ఉంటున్నారు. ఒకప్పుడు బెంగాల్ తాగునీటి సమస్య ఉండేది. దాన్ని మమతా అధికారంలోకి వచ్చాక పరిష్కారించారు.
2011 లో మమతా బెనర్జీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎవోయూలు తప్పా వచ్చిన కంపెనీలు పెద్దగా లేవు. ఉన్నవాటిలో కొన్ని టాటా చెప్పేశాయి. అధికారపార్టీ నాయకుల అక్రమాలను, అవనీతి చాలా ఎక్కువే. నియమాకాల్లో అక్రమాలతో.. 26వేల మంది సెకండ్రీ గ్రేడ్ స్కూల్ టీచర్లను సుప్రీంకోర్టు తొలగించింది. ప్రైమరీ స్కూళ్లకు చెందిన 32వేల మంది టీచర్ల నియమాకాలను హైకోర్టు సింగిల్ జెడ్జ్ రద్దు చేశారు. కేసు డివిజన్ బెంచ్ కు చేరింది. శాంతి భద్రతలు కంట్రోల్ లో లేవు. రాజకీయ ప్రత్యర్ధులపై దాడులను లెక్కపెట్టలేం. మొన్నటికి మొన్న వరద బాధితుల పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీ ఖగైన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్ పై రాళ్ల దాడి జరిగింది. ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. టీఎంసీ వర్గీయులే ఈ దాడికి కారణమని బీజేపీ వాదన. అంతర్గత దాడుల్లో వాళ్ల వర్గీయులే కొట్టారని టీఎంసీ అంటోంది. 14 ఏళ్ల టీఎంసీ పాలనలో శాంతి భద్రత అంశాల్లో మమతా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఏడాదికిందట ఆర్జీకర్ మెడికో విద్యార్థి అత్యాచారం దేశాన్నే కుదిపేసింది. ఇక వెలుగులోకి రానివి చాలానే ఉన్నాయి. అయిన కూడా ఆ తర్వాత జరిగి ఉపఎన్నికల్లో టీఎంసీనే గెలిచింది. మమతా తర్వాత.. తృణమూల్ లో
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. బెంగాల్ గవర్నర్ గా ఎవరు ఉన్న దీదీతో ఫైట్ సర్వసాధారణం. కేంద్రంతో కూడా తరుచు గొడవలే. ప్రధాని మోడీ కంటే.. హోంమంత్రి అమిత్ షానే దీదీ టార్గెట్. గతంలో ఎన్ సీఆర్.. ఇప్పుడు ఎస్సైఆర్ అన్నింటికి ఆయనే కారణమన్నది మమతా ఆరోపణ. ఈ గొడవలతోనే కేంద్రం నుంచి సరైనా ఆర్ధిక సాయం అందడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇలా ఎన్ని ఉన్నా.. ఏం చేసిన.. జనంలో మమతా క్రేజ్ తగ్గలేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఆమె సిప్లిసిటి, సాధారణ జీవన విధానం, ప్రజలను మెప్పిస్తాయి. అందుకే మమతాను దీదీగా అభిమానిస్తారు. ఎవరెన్నీ అభిప్రాయాలు,విమర్శలు చేసిన.. మమతాను చూడగానే అంతా మర్చిపోతారనే అభిప్రాయం ఉంది. జనంతో ఆమెకున్న అనుబంధం అలాంటి. 35 శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఆమె మరో ప్లస్ పాయింట్. బెంగాల్ నార్త్ మినహా మిగిలిన స్థానాల్లో క్యాడర్, లీడర్లకు కొదవలేదు. పార్టీ కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఎప్పటిలాగే సింగిల్ గా పోటీ చేయ్యడానికి టీఎంసీ పార్టీ రెడీ గా ఉంది.
బెంగాల్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న.. బీజేపీ ఆ పాత్రలో అంతగా సక్సెస్ కాలేదనే వాదన ఉంది. ప్రభుత్వం తప్పిదాలను ఒడిసి పట్టడమే కాదు. పోరాటాల్లోనూ వెనకపడిందనే అభిప్రాయం ఉంది. ఆర్జీకర్ ఘటన పై మీడియా పెట్టిన ఫోకస్ కూడా అక్కడి లోకల్ లీడర్లు పెట్టలేకపోయారట. టీఎంసీ దాడులు,అన్యాయాలను సరిగ్గా ఎదిరించలేదనే వాదన ఉంది. మత కలహాలను క్యాష్ చేసుకొవడంలోనూ ఇదే పరిస్థితి. బంగ్లాదేశ్ అక్రమవలసదారుల ఓట్లతో టీఎంసీ గెలుస్తుందని.. బీజేపీ ఆరోపణలు చేస్తుంది. అయితే అక్రమ చోరబాటుదారులను ఆపాల్సిన బాధ్యత సరిహద్దులో ఉండే కేంద్ర బలగాలదే కానీ.. రాష్ట్రంపై నిందలు వేయ్యడం ఏంటన్నది మమతా ప్రశ్న. గత 14 ఏళ్లలో కేంద్రం బెంగాల్ కు చాలానే చేసిందనేది కమలం పార్టీ వాదన. అంతా ఉత్తదే అని టీఎంసీ అంటోంది. కనీసం ఉపాధి హామీ నిధులు కూడా చెల్లించకపోతే.. రాష్ట్రమే చెల్లించిదని చెబుతోంది.
బెంగాల్ రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగిన వాటిని రాజకీయంగా వాడుకోవడం మమతా దిట్ట. బెంగాల్ ప్రజలు అంటే బీజేపీకి నచ్చదని.. అందుకే ఆ పార్టీ అధికారంలోకి ఉన్న రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తుంటారు. ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేస్తుంటారు. మమతా కు సరితూగే నేతలు ఎవ్వరు బీజేపీలో లేరు. ఒకప్పుడు దీదీ తర్వాత టీఎంసీ నాయకత్వం ఖాయమనుకున్న సువేందు.. అభిషేక్ బెనర్జీ రాకతో.. బీజేపీ లోకి వెళ్లిపోయారు. కొన్ని ప్రాంతాల్లో సువేందుకు మంచి పట్టుంది. గతంలో మమతా బెనర్జీ నందీగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతాను ఓడించడం సువేందు బలానికి నిదర్శనం. బెంగాల్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న మమతాతో పోటీ పడేంత పోలిటికల్ గ్లామర్ మాత్రం లేదు. బీజేపీ అధినాయకత్వం మాత్రం పూర్తి మద్దతు ఉంది. సువేందుకు ఇబ్బందిగా ఉండరాదనే.. పెద్ద గ్రాఫ్ లేని సమిత్ భట్టా చార్యను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. కానీ క్యాడర్,లీడర్లలో సువేందుకు పూర్తి ఆమోదం లేదు. ఇప్పటికీ ఆయన్ను బయట నుంచి వచ్చిన నేతగా చూసేవాళ్లు ఉన్నారు. West Bengal Politics.
గతంలో బెంగాల్ బీజేపీ చీఫ్ గా పనిచేసిన దిలీప్ ఘోష్ రాజకీయంగా ప్రభావాన్ని కొల్పోయారు. పార్టీలో కొనసాగుతున్న అంతా యాక్టివ్ గా ఉండడంలేదు. అయితే బెంగాల్ లో బీజేపీ సొంత బలంతో ఎదిగిన పార్టీ కాదనే వాదన ఉంది. ఆర్ఎస్ఎస్,బీజేపీ హిందుత్వ రాజకీయాలకు ప్రజల ఆమోదం తక్కువ అన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. తొలి నుంచి బీజేపీ,ఆర్ఎస్ఎస్ నుంచి కలిసి నడిచిన క్యాడర్, లీడర్ల సంఖ్య తక్కువే. లెప్ట్ పార్టీల నుంచి వలస వచ్చిన నేతలతో కమలం పార్టీ నిండిపోయింది. టీఎంసీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ల సంఖ్య తక్కువేమి కాదు. వీరికి బీజేపీ సిద్దాంతం, ఆర్ఎస్ఎస్ భావజాలం లేదు. అధికార టీఎంసీ ని తట్టుకొని నిలబడాలంటే.. ఢిల్లీని ఏలుతున్న బీజేపీ సాయం అవసరమైంది. అత్యధికులు అలా వచ్చినవారే. ఏదేమైనా 2019 లోక్ సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచి టీఎంసీకి బీజేపీ సవాల్ విసిరింది. ఆ తర్వాత దూకుడు పెంచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జెండా పాతాలనే టార్గెట్ పెట్టుకుంది. మోడీ,అమిత్ షా లతోపాటు కేంద్ర పెద్దలంతా.. బెంగాల్ ను చుట్టేశారు. ఈ అంశాన్ని మమతా వాడేసుకున్నారు. బెంగాల్ పై బీజేపీ యుద్ధానికి వస్తుందని.. ఎదురుదాడికి దిగారు. వారికి అధికారం ఇస్తే.. ఢిల్లీ ముందు మోకరిల్లక
బెంగాల్ లో కమ్యూనిస్టు పార్టీ 35ఏళ్లపాటు అధికారంలో ఉన్న దాదాపుగా ఉనికిని కొల్పోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటు గెలవలేదు. నాయకుల్లో చాలామంది బీజేపీలోకి వెళ్లిపోయారు. కొందరేమో టీఎంసీ బాట పట్టారు. క్యాడర్ పరిస్థితి కూడా అదే. 14ఏళ్లపాటు అధికారానికి దూరమైన కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కొత్తతరం కృషి ఫలిస్తున్నట్లే ఉంది. కానీ ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాయా..? అంటే ఇప్పుడు చెప్పలేం. కమ్యూనిస్టుతో జట్టు కట్టిన కాంగ్రెస్ కూడా అసెంబ్లీ సీట్లలో ఇంకా బెంగాల్ లో ఖతా తెరవలేదు. ఒక్క ఎంపీ సీటు గెలిచింది. ఆ ఎంపీ కూడా 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఈ సారి కాంగ్రెస్ పోత్తులో వెళ్లిన.. ఒంటరిగా వెళ్లిన ఫలితం శూన్యమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో పోలిటికల్ ఫేస్ ఎలా ఉంటుందో తెలియాలంటే.. మరో ఆరు నెలలు ఆగాల్సిందే.