
Mitra Mandali Review:నటులు:ప్రియదర్శి,నిహారిక ఎన్ ఎం,సత్య,విష్ణు ఓయి,రాగ్ మయూర్,ప్రసాద్ బెహరా,విటివి గణేష్,వెన్నెల కిషోర్
ప్రొడ్యూసర్: బన్నీ వాసు
దర్శకుడు:విజయేందర్ సత్తు
“కోర్ట్” సినిమా తో హిట్ కొట్టిన ప్రియదర్శి..ఈ సారి ఒక ఫన్ ఫుల్ రైడ్ తో దీపావళికి ప్రేక్షకులను అలరించడానికి “మిత్ర మండలి” తో థియేటర్స్ లోకి వచ్చేసాడు. ‘ఈ సినిమా నచ్చకపోతే.. నా నెక్ట్స్ సినిమాని చూడకండి’ అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు ప్రియదర్శి.డైరెక్టర్ విజయేంద్ర కూడా చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. ఇక ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఐతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ నెగటివ్ ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు.దీపావళికి 4 సినిమాలు బరిలో ఉండగా…”మిత్ర మండలి” కి ఒక రోజు ముందు నుంచే ప్రేమిర్స్ స్టార్ట్ చేసారు ప్రొడ్యూసర్ బన్నీ వాసు.మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం…Mitra Mandali Review
జంగ్లీపట్నం లో మొదలైన కథలేని కథ…ఆ కథలేని కథ లో పని పాత లేను నలుగురు స్నేహితులు ఏ విధంగా వుంటారు అనేది ఇందులో ముఖ్యంగా కనిపిస్తుంది.ముందుగా డైరెక్టర్ ఇందులో టైటిల్ కార్డ్స్ లో వైవిధ్యం చూపించారు. కథ లేకుండా మరి రెండున్నర గంటల పాటు ఏం చూపించారంటే…పని పాట లేని నలుగురు స్నేహితులు,వాళ్ళు ఎంత వేస్ట్ ఫెలోస్ అనే విషయం ఎంట్రీ సీన్ తోనే క్లియర్ గా చూపించాడు దర్శకుడు..బ్యాట్, బాల్, వికెట్లు లేకుండానే క్రికెట్ ఆడటం,అది చూస్తున్న వాళ్ళని పిచ్చి వాళ్ళని చేయడం ఇదంతా చూస్తే ఇదేంటి రా బాబు అనిపించేలా వుంది..ఆ నలుగురిలో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించటం, ఆ అమ్మాయి కోసం వాళ్ళు ఎన్ని పిచ్చి వేషాలు వేయాలో అన్ని వేయటం..ఆ అమ్మాయి మాత్రం వీళ్లల్లో ఆ ఇద్దరినీ కాకుండా ఇంకొకడిని లవ్ చేయటం వెరైటీ గా అనిపిస్తుంది. అందులోను ఆ అమ్మాయి ఆ ఊరిలో కులం అంటే పది చచ్చిపోయే ఒకడి కూతురు…ఇంకా ఆ అమ్మాయి వల్ల వీళ్ళు ఎలాంటి సమస్యలు పడ్డారు? కులపిచ్చోడు ఎం చేస్తాడు? చివరికి మిత్ర మండలి అంత కలిసి ఎం చేస్తుంది? ఇవన్నీ కలిపి సినిమాలో చూడాలి..
ఇందులో చైతన్య (ప్రియదర్శి), అభి (రాగ మయూర్), సాత్విక్ (విష్ణు ఓయి సా), రాజీవ్ (ప్రశాంత్ బెరహా).. ఈ నలుగురి ‘మిత్రమండలి’ ఇందులోని సభ్యులు. రాత్రి అయితే తాగడం.. తిరగడం.. ఇంట్లో వాళ్లంతో తన్నులు తినడం ఇదే వీళ్ల పని. వీళ్లు ఉండే జంగ్లీ పట్నంలో నారాయణ (వీటీవీ గణేష్)కి విపరీతమైన కులపిచ్చి. కులాన్ని వెనకేసుకుని ఎమ్మెల్యే సీటు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తుంటాడు. సరిగ్గా సీటు ఇచ్చే టైమ్‌కి నారాయణ కూతురు స్వేచ్ఛ (నిహారిక).. వేరే కులపోడైన చైతన్య (ప్రియదర్శి)తో పారిపోతుంది.పరువు-పదవి-కులపిచ్చి నేపథ్యంలో నారాయణ తన కూతురి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనే విషయాన్ని సినిమాలో చాలా ఫన్ ఫుల్ గా చూపించారు.
కామెడీ విషయంలో దర్శకుడు తాను రాసుకున్న లైన్ కి న్యాయం చేసారు అనిపించింది.కొంచం అటు ఇటు అయినా చాలా ఇబ్బంది పడాలి. కానీ ప్రేక్షకులను నవ్వించగలిగారు.స్టోరీ లేకపోయినా ఏదో వుంది అనిపించేలా చేసారు.జాతిరత్నాలు అంత నవ్వించకపోయినా పర్వాలేదు అనిపించింది.మొత్తంగా చూస్తే ఈ దీపావళికి హాయిగా నవ్వుకోడానికి ఒకసారి చూసే విధంగా వుంది “మిత్రమండలి”.