రష్యా వద్దు అమెరికా ముద్దు..?

Spread the love

Trump India and Russia: రష్యా భారత్ కు ఎంత మంచి మిత్రుడో అందరికి తెల్సిందే. అలాంటి దేశంతో భారత్ శుత్రుత్వం దిశగా అడుగులు వేస్తోందా..? రష్యా నుంచి చమురు దిగుమతిని ఆపానుందా..? అమెరికాతో ఇండియాకు చమురు డీల్ ఎలా కుదిరింది..? పుతిన్ పర్యటన వేళ ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహాం ఏంటి..? ట్రంప్ చమురు కామెంట్స్ పై భారత్ రియాక్షన్ ఏంటి..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రష్యా – భారత్ దేశాల మధ్య స్నేహం ఈనాటిది కాదు. వాణిజ్య ఒప్పందాలతో మొదలైన ప్రెండ్షిప్ దశాబ్ధాలు గడుస్తున్న ఇంకా కొనసాగుతునే ఉంది. ఈ 11 ఏళ్లలో ఇండియా స్థాయి మరింత పెరిగింది. అలాగే మోడీ పుతిన్ ల మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది. భారత్ ను నమ్మితే.. ఏలాంటి పరిస్థితుల్లోనూ మోసంపోము అనే విషయం ఇటీవలే రష్యాకు అర్ధమైంది. భారత్ పై అమెరికా నీడ కూడా పడకుండా పుతిన్ చూసుకుంటున్నారు. భారత్ కు నేనున్నానని అంటున్నారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో భారత్ గురించి మాట్లాడి.. అమెరికా, పాక్ ల నోర్లు మూయించారు. ఇంతకీ ఆయన ఏమన్నారనే విషయానికి వస్తే.. భారత్ తో తమకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదని అన్నారు. భారీగా ముడి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల భారతదేశంతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చర్యలు రూపొందించాలని ఆయన తన ప్రభుత్వాన్ని ఆదేశించారు. భారత్..రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడం మానేస్తే…9 బిలియన్ల నుంచి 10 బిలియన్ల మధ్య నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. భారత ప్రధాని మోడీ మీద తనకు అపార నమ్మకముందని…ఆయన నిర్ణయాలను చాలా నిశితంగా పరిశీలించి తీసుకుంటారని పుతిన్ చెప్పారు. మోడీ తనకు చాలా మంచి స్నేహితుడని తెలిపారు.

అమెరికా విధించిన అధిక సుంకాల నుంచి వచ్చే నష్టాలను రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా తగ్గించవచ్చని చెప్పారు. వాణిజ్య అసమతుల్యతను తొలగించడానికి, రష్యా భారతదేశం నుండి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలను కొనుగోలు చేస్తుందని వివరించారు. మరోవైపు అమెరికాను పుతిన్ తీవ్రంగా విమర్శించారు. భారత్ కు అన్నీ అడ్డంకులు పెడుతున్న ఆ దేశం తానే స్వయంగా మాస్కో నుంచి అన్నీ కొనుగోలు చేస్తోందని తెలిపారు. వారికి ఒక న్యాయం…ఇతరులకు మరొక న్యాయం అన్నట్టు ప్రవర్తిస్తోందని విమర్శించారు. భారత్ కు తమ సహకారం ఎప్పుడు ఉంటుందని.. ఈ దేశం జోలికి ఎవ్వరైనా వస్తే.. వదలిపెట్టేది లేదని కూడా అన్నారు. ఇండియాకు నష్టం చేకూర్చాలని చూస్తే.. ఆ దేశాన్నే లేకుండా చేస్తామని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు పుతిన్. ఈ క్రమంలోనే పుతిన్ త్వరలో భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. గత సంవత్సరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాస్కోలో పర్యటించిన సమయంలో అందించిన ఆహ్వానం మేరకు.. పుతిన్ ఇప్పుడు భారత్ కు వస్తున్నారు. ఈ ఉన్నత స్థాయి పర్యటనకు సంబంధించిన తేదీలు కూడా తాజాగా ఖరారైనట్లు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల రష్యా రాజధాని మాస్కోలో పర్యటించారు. ఆ పర్యటన

ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ 5, 6వ తేదీల్లో పుతిన్ న్యూఢిల్లీలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక్కసారి కూడా భారత దేశానికి రాలేరు. కానీ తొలిసారిగా ఆయన ఇండియాకు రెండ్రోజుల పర్యటన నిమిత్తం రాబోతున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇక్కడ రక్షణ, ఇంధనం, వాణిజ్యం వంటి పలు కీలక అంశాలపై ఇద్దరు అగ్రనేతలు చర్చించే అవకాశం ఉంది.రష్యా చమురుపై సుంకాలు విధించడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థికంగా సహకారం అందకుండా రష్యాపై ఒత్తిడి పెంచాలని అమెరికా భావించింది. అయితే తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నామని భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా యుద్ధం వల్ల సంప్రదాయ చమురు సరఫరాలు దెబ్బతినడంతో.. తక్కువ ధరకు లభిస్తున్న రష్యా చమురును భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-రష్యా సంబంధాలు మరింత దృఢంగా మారుతున్నాయని అంతా అనుకున్నాం కానీ.. ఈ రెండు దేశాల మధ్యలోకి ట్రంప్ వచ్చి చేరారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ సహా అన్ని దేశాలపై ఇటీవల టారిఫ్‌ లతో విరుచుకుపడ్డారు అయితే భారత్‌ పై మొదట 25 శాతం పన్నులు విధించిన ట్రంప్.. ఆ తర్వాత మరో 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌ తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి తక్కువ ధరకే చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ పై అదనంగా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ గతంలోనే ప్రకటించారు. అయితే తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా.. ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడే తాము చమురు కొనుగోళ్లు చేస్తున్నామని భారత్ చెబుతున్నప్పటికీ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యా – భారత్ ల మధ్య గ్యాప్ పెంచాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని ప్రధాని నరేంద్ర మోఢీ తనకు హమీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు.

భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం నాకు సంతోషంగా లేదు. మోడీ నాకు ఈ రోజు ఒక హమీ ఇచ్చారు. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని చెప్పారని వైట్ హౌజ్ లోని ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.భారత ప్రధానితో తనకు అత్యంత దగ్గరి అనుబంధం ఉందని ట్రంప్ అన్నారు. భారత్ తరువాత చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని చెబుతానని పేర్కొన్నారు.

అయితే ట్రంప్ న్యూఢిల్లీ పై అదనంగా 25 శాతం సుంకాలు విధించిన తరువాత కూడా భారత్ రష్యా నుంచి నిరాటంకంగా చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. అంతే కాకుండా అమెరికా, యూరప్ రష్యా తో చేస్తున్న వ్యాపారాలను గణాంకాలతో బయటపెట్టింది.

ట్రంప్ సుంకాలు 50 శాతం చేరిన వేళ భారత్ ప్రధాని స్పందించారు. భారత రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపే అంశాలపై తాను రాజీపడబోనని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించిన ఆయన వ్యాఖ్యానించారు. తాను దేశం కోసం ఎంతమూల్యమైన చెల్లిస్తానని ప్రకటించారు.

మేక్ ఇన్ ఇండియా తో దేశం స్వయం సమృద్ధి సాధించాలని, నిరాశ నుంచి కాకుండా గర్వం నుంచి స్వావలంబన సాధించాలని దేశ ప్రజలకు ఎర్రకోట నుంచి పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్వార్థం పెరుగుతోందని, కూర్చుని మన కష్టాల గురించి ఏడవకూడదని, ఇతరుల గుప్పిట్లో మనం ఉండకూడదని ఆయన సందేశమిచ్చారు. ఇదే క్రమంలో ట్రంప్ ఇజ్రాయోల్ – హామాస్ మధ్య శాంతి ఒప్పందం చేశారని చెప్పి.. మోడీ అలా ట్రంప్ ను అభినందించారో లేదో.. భారత్ – రష్యాల మధ్య గొడవలు సృష్టించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తాజాగా కీలక ప్రకటన చేశారు. సరైన ధరకు లభిస్తే.. అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను మరింత పెంచడానికి భారత్ సిద్ధంగా ఉందని రాజేష్ అగర్వాల్ స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు బయటికి రావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ఈ వాణిజ్య ఒప్పందం ఖరారైతే.. భారత ఎగుమతులపై ప్రస్తుతం అమెరికా విధిస్తున్న 50 శాతం టారిఫ్‌ లు తగ్గే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

భారతీయ దిగుమతులపై విధించిన మొత్తం టారిఫ్‌ లలో.. 25 శాతం టారిఫ్‌ ను రాయితీపై రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలును కొనసాగిస్తున్నందుకు అమెరికా పెనాల్టీగా విధించింది. భారత తరపున కీలక చర్చల్లో ఉన్న రాజేష్ అగర్వాల్.. తమ దేశం తన ఇంధన దిగుమతులను మరింత విస్తరించాలని భావిస్తోందని స్పష్టం చేశారు. గతంలో అమెరికా నుంచి భారత్ 23 బిలియన్ డాలర్ల ఇంధన కొనుగోళ్లు చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ ఇంధన కొనుగోళ్లను 13 బిలియన్ డాలర్ల మేర పెంచడానికి భారత్‌కు ఇంకా అవకాశం ఉందని రాజేష్ అగర్వాల్ అమెరికా నుంచి వెల్లడించారు. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ సంవత్సరం మొదటి భాగంలో అమెరికా నుంచి భారత్ 8.5 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకుంది. ఇది దేశం మొత్తం దిగుమతుల్లో 3.5 శాతం మాత్రమే కావడం గమనార్హం. Trump India and Russia.

ఇక భారత్‌ కు వచ్చే అధిక భాగం అంటే 36.3 శాతం లేదా 89.5 మిలియన్ టన్నుల చమురు రష్యా నుంచే వస్తుండటం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టులో భారత్‌పై టారిఫ్‌లను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచిన అమెరికా.. తక్కువ ధరకు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసి.. దాన్ని శుద్ధి చేసి.. తర్వాత పశ్చిమ దేశాల మార్కెట్‌లో చమురు ఉత్పత్తులను తిరిగి అమ్మి భారత్‌ లాభపడుతోందని ఆరోపణలు చేసింది. అమెరికా చేస్తున్న ఆరోపణలపై స్పందించిన భారత్.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని అమెరికానే తమను ప్రోత్సహించిన విషయాన్ని భారత్ గుర్తు చేసింది. ఇంధన భద్రత అవసరాల ఆధారంగానే చమురు కొనుగోలుపై తమ నిర్ణయం ఉంటుందని ఎప్పటికప్పుడు భారత్ స్పష్టం చేస్తూనే వస్తోంది. సుంకాల విధింపు ఉన్నప్పటికీ.. భారత్, అమెరికా తమ వాణిజ్య చర్చలను కొనసాగిస్తున్నాయి. అంతేకానీ రష్యాతో చమురు ఒప్పందాలను రద్దు చేసుకోలేదు.