పవన్ కళ్యాణ్ కు భారీ ఊరట..క్రిమినల్ కేసు కొట్టివేత

మెగా9, ఆంద్రప్రదేశ్ : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గుంటూరు స్పెషల్ కోర్టు ఊరట కలిగించింది.
పవన్ కళ్యాణ్ పై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

గత ఏడాది 2023, జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ వాలంటీర్లు పై కొన్ని ఆరోపణలు చేశారు. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారు. ఇళ్లలో మగవాళ్ళు లేని సమయంలో వెళ్తున్నారని, దండుపాళ్యం బ్యాచ్‌‌లా మారారని, ఆ వ్యవస్థపై సరైన జవాబుదారీతనం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్సార్, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు.

పవన్‌పై ఫిర్యాదు చేయాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు
వాలంటీర్లుపై పవన్ కామెంట్స్, ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు..వీటి ఆధారంగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ అదే నెల 20న అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రభుత్వమే డైరెక్ట్ చేయడంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు న్యాయస్థానంలో ఫిర్యాదు చేసారు. ఆ మేరకు పవన్ కల్యాణ్ పై అప్పట్లో 499, 500 ఐసీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. తాజాగా పవన్ హైకోర్టును ఆశ్రయించడం, తిరిగి ఫిర్యాదు చేసిన వాలంటీర్లను కోర్టు విచారించడం, అందులో చేసిన సంతకాలు మావి కాదంటూ ఆ వాలంటీర్లు చెప్పడంతో ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పై కేసు ఎత్తివేస్తున్నట్టు న్యాయమూర్తి శరత్ బాబు తీర్పు ను ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *