దుర్గమ్మకు పవిత్ర ఆషాడ సారె సమర్పించిన ఆలయ సిబ్బంది

ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మకు ఈరోజు ఆలయ సిబ్బంది పవిత్రమైన ఆషాడ సారె సమర్పించారు. ప్రతి ఏడాదీ ఆచారంగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని సిబ్బంది ఈ ఏడాది కూడా కొనసాగించారు. ఆలయ వైదిక సిబ్బందితో పాటు పరిపాలనా సిబ్బంది మొత్తం కుటుంబసభ్యులతో కలిసి కనకదుర్గ నగర్ నుంచి ఊరేగింపుగా రాగా.. ఆలయ ఈవో కేఎస్ రామారావు వీరికి మంగళవాయిద్యాల నడుమ ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారి దర్శనం చేసుకుని మహామండపం 6 వ […]