సీఎం చంద్రబాబు ఇంటిముందు రచ్చ రచ్చ చేసిన మహిళ
మెగా9, ఆంద్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. తిరుపతి, నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ చంద్రబాబును కలిసి తన సమస్యలను చెప్పేందుకు వచ్చింది. కానీ సీఎం చంద్రబాబును కలవనియకుండా యశోదను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో యశోద తన చేతి గాజులు పగలగొట్టుకొని వాటిని మింగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులో తీసుకొని పోలీస్ […]
పవన్ కళ్యాణ్ కు భారీ ఊరట..క్రిమినల్ కేసు కొట్టివేత
మెగా9, ఆంద్రప్రదేశ్ : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గుంటూరు స్పెషల్ కోర్టు ఊరట కలిగించింది.పవన్ కళ్యాణ్ పై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత ఏడాది 2023, జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ వాలంటీర్లు పై కొన్ని ఆరోపణలు చేశారు. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారు. ఇళ్లలో […]
మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ
మెగా9 న్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ లో ఈమధ్య కాలంలో దొంగతనాల కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ విచిత్రంగా ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న నేతల ఇళ్లను కూడా దొంగలు టార్గెట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో మంత్రి ఇంట్లో ఇప్పుడు దొంగలు పడినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాలకు వెళ్తే హైదరాబాద్ […]
కొడాలి నిర్వాకంపై పవన్ ఫైర్-బాటిల్ చూపిస్తూ మరీ..!
గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న ఎమ్మెల్యే రామును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు వవన్ తెలిపారు. రాష్ట్రస్థాయి పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల నీటి సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే రాము తీసుకెళ్లారు. నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాల్లోనీ 43 గ్రామాల్లో ప్రజల త్రాగునీటి కష్టాలపై పవన్ కళ్యాణ్ కు వినతిపత్రం అందజేశారు. […]
తూర్పుగోదావరిలో మద్యం షాపులు దక్కేదెవరికో ?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మద్యం టెండర్ల లాటరీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. కలెక్టర్ ఆఫీసు ప్రాంగణం మద్యం షాపుల ఆశావాహులతో సందడిగా మారింది. దీంతో మద్యం షాపులు ఎవరికి దక్కుతాయన్న టెన్షన్ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరు మద్యం దుకాణాలు దక్కించుకున్నారో మధ్యాహ్నం 3గంటల తర్వాత తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు. మద్యం టెండర్ల లాటరీ ప్రక్రియపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు..
అంబటికి గట్టి షాక్ తగలబోతోందా ? జగన్ కరుణించినా అక్కడ ఝలక్..!
పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి రాజకీయాలది ప్రత్యేక స్థానం. ఈ నియోజకవర్గం నుండి స్థానికుల కంటే స్థానికేతరులకే ఆయా పార్టీలు అధిక ప్రాధాన్యం కల్పిస్తాయి. వైసీపీ ఆవిర్భావం నుండి సత్తెనపల్లి లో అంబటి రాంబాబు పార్టీ బాధ్యతలు చూసుకునే వారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి కోడెల శివప్రసాదరావు చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన అంబటి.. ఆ తరువాత 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు అధికారం పోయాక మళ్లీ […]
పొట్టి ఆవుల్ని పెంచుతున్న నాడీపతి డాక్టర్..! ఏంటీ మినియేచర్ ప్రత్యేకత..?
హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువు ఆవు. గోమాతగా పూజించుకునే ఆవుల్ని పెంచేందుకు ప్రత్యేకంగా గోశాలలు చాలానే ఉన్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అపార్ట్మెంట్ ల లో సైతం పెంచుకోవడానికి అనువుగా మినియేచర్ ఆవులు పుట్టుకొస్తున్నాయి. ఆవులను మాంసం కోసం కబేళాలకు తరలించకుండా ఉండేందుకు చిన్న చిన్న ఆవులను పెంచడం తప్పనిసరి అవుతోంది. ఇలా కాకినాడ జిల్లాకు చెందిన ఓ నాడీపతి డాక్టర్ పొట్టి ఆవుల కోసం ఏకంగా గోశాల నిర్వహిస్తున్నారు. ఆవులు మనుషులకు ఎంతో మచ్చికైన […]
దూసుకొస్తున్న జమిలి ఎక్స్ ప్రెస్-కేంద్రం నెక్స్ట్ స్టెప్ రెడీ.. ! రాష్ట్రాలకూ షాక్..
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జమిలి ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తీసుకుంది. దీంతో పాటు సుప్రీం ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ను ప్రధాని మోడీ కలిశారు. అటు పార్లమెంట్ లో మూడు కీలక రాజ్యాంగ సవరణల బిల్లుల్ని కేంద్రం సిద్ధం చేస్తోంది. దీంతో అనుకున్న దాని కంటే ముందే జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ […]
చంద్రబాబు పాప ప్రక్షాళనకు విడదల రజినీ పూజలు.. !
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొరిటిపాడు సెంటర్లోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళన జరగాలని కోరుతూ మాజీ మంత్రి విడదల రజిని పూజలు నిర్వహించారు.కూటమి ప్రభుత్వం రాజకీయాలను ప్రజలను గమనిస్తున్నారని ఆమె తెలిపారు. వంద రోజులు పాలనలో ఏంచేయలేకపోయారని, దాన్ని పక్కదారి పట్టించేందుకు అపవిత్రం అంటూ ప్రచారాలు చేస్తున్నారనీ విమర్శించారు. సమాజానికి ఇటువంటి ప్రచారం మంచిది కాదన్నారు.
సిగ్గులేని ప్రభుత్వం, పనికిమాలిన మాటలు – రెచ్చిపోయిన రోజా.. !
పనికిమాలిన రాజకీయం చేయడంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కు మించి ఎవరు చేయరని మాజీ మంత్రి ఆర్కే.రోజా తెలిపారు. ఇన్నేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు తిరుమల పర్యటనకి వెళ్లారు కానీ ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డికి భయపడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కూటమి ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం అని పలికారు. పనికిమాలిన మాటలు పక్కన పెట్టి ప్రజలకు మంచి చేసే ఆలోచనలు ముందుకెళ్తే బాగుంటుందని మాజీ మంత్రి ఆర్కే.రోజా అన్నారు.