చంద్రబాబు కోసం తిరుపతిలో వైసీపీ పూజలు-కారణం చెప్పిన భూమన..!

తిరుపతి శ్రీతాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో వైసీపీ నేతలు భూమన కరుణాకరరెడ్డి, గురుమూర్తి పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేసినట్లు భూమన తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బ తెసేలా అనరాని మాటలు అన్నారని, నెయ్యికు బదులుగా జంతువుల కొవ్వు వాడారనే అపవాదు వేశారని భూమన ఆరోపించారు. సాక్షాత్తు ముఖ్య మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు వాఖ్యలు చేసారన్నారు. ఆలయ పవిత్ర మంట కలిపే విధంగా వ్యవహరించారని, అందుకే చంద్రబాబుకు […]

ఏచూరి మరణం వెనుక బీజేపీ ? చింతామోహన్ షాకింగ్ కామెంట్స్..!

కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి మరణం వెనుక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఊపిరితిత్తుల‌ సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సరైన వైద్యం అందలేదన్నారు. స్వైన్ ఫ్లూ రోగిని ఏచూరి పక్క బెడ్ లోనే అడ్మిట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఏచూరి మరణం వెనక అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. మానవత్వం,సెక్యులరిజం, దళితులు గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. సొంత […]

అమ్మకు ఇష్టం కాబట్టి అవే వేసుకుంటా-టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల..!

విజయవాడ బందర్ రోడ్డులో చెన్నై షాపింగ్ మాల్ నూతన షో రూమ్ హీరోయిన్ శ్రీ లీల ప్రారంభించారు. గతంలో విజయవాడలో చాలా షోరూమ్ లు ప్రారంభించానని, కానీ చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకతే వేరని శ్రీలీల తెలిపారు. అమ్మకి పట్టుచీరలు అంటే చాలా ఇష్టం, అందుకే తాను కూడా పట్టుచీరలు కట్టుకుంటానని వెల్లడించారు. లైట్ వెయిట్ ఉన్న పట్టు చీరలు అంటే చాలా ఇష్టమన్నారు. సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందని, రవితేజ తో త్వరలో కొత్త సినిమా […]

జగన్ ను అడ్డుకోవడానికి మేం చాలు-తిరుపతి బీజేపీ నేతల వార్నింగ్..!

జగన్ కు స్వామి వారి అనుగ్రహం లేదని, స్వామి వారి ఆశీర్వాదం లేనందునే జగన్ కు దర్శనం కాలేదని తిరుపతి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు ఎందుకు ఇబ్బందని ఆయన ప్రశ్నించారు. జగన్ పులివెందులకు శాసన సభ్యుడు మాత్రమే..ఎందుకు అంత అహంకారం అన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో దళితులను రాకుండా అడ్డుకున్నామా అని జగన్ ను ప్రశ్నించారు. కుల మతాలను రాజకీయాల్లోకి లాగద్దొన్నారు. జగన్ అడ్డుకోవడానికి తిరుపతిలో బీజేపీ నాయకులే […]

తిరుమలకు జగన్ ఎప్పుడెళ్తారో చెప్పిన మాజీ మంత్రి-ఎవరాపుతారో చూస్తాం.. !

చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం వేంకటేశ్వర స్వామిని లాగుతున్నారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కల్తీ నెయ్యి వాడలేదని తెలిసీ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు జగన్ ను ఎదుర్కునే ధైర్యం లేదని, తల్లి తండ్రులు అంటే భయం లేదని, దేవుడు అంటే భక్తి లేదని విమర్శించారు. అతి కొద్ది రోజుల్లో మళ్ళీ జగన్ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారని, […]

జగన్ కు ఇప్పుడిచ్చారు-మాకు ఎప్పుడో ఇచ్చారు-జనసేన నేత కిరణ్ రాయల్ షాకింగ్..!

పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ కు ఇప్పుడు నోటీసులు ఇచ్చారని, మాకు అలాంటివి ఎప్పుడో ఇచ్చారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. జగన్ తిరుపతిలో అల్లర్లు,మతకల్లోలాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని, ఆయన్ను కొట్టడానికి తాము గుడ్లు కొన్నామని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని తెలిపారు. గులకరాయో,గొడ్డలి వేటు లాంటివి మరలా క్రియేట్ చేసి సానుభూతి పొందాలని చూసారన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తాము తిరుపతిలో శాంతియుత నిరసనలు విరమించుకున్నామని తెలిపారు. డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం […]

టీటీడీ పని చంద్రబాబు, పవన్ చేస్తారా ? కాకాణి ఫైర్..!

ఏపీలో ఎప్పుడూ లేని విధంగా వెంకటేశ్వర స్వామి మీద ఆరోపణలు రావడం దురదృష్టకరమని వైసీపీ మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసారన్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగమే అన్నారు. వెంకటేశ్వర స్వామి మీద, స్వామివారి కైంకార్యాల మీద అసత్యాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేసినట్లు కాకాణి తెలిపారు. వక్రబుద్ధి నుంచి చంద్రబాబు కు మంచి బుద్ధి రావాలని స్వామిని […]

జగన్ క్రైస్తవుడు కాదు నాస్తికుడు-టీడీపీ ఎమ్మెల్యే జీవీ కామెంట్స్..!

జగన్ రాష్ట్రానికి పట్టిన శని అని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్ వల్లే తిరుమలకు చెడ్డ పేరన్నారు. వెంకటేశ్వర స్వామి ముందు నిలబడే ధైర్యం లేకనే జగన్ తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారన్నారు. డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటే జగన్ కి రోషమెందుకని ప్రశ్నించారు. తిరుమల సంప్రదాయాలు ఎవరైనా పాటించాల్సిందే అన్నారు. లడ్డు ప్రసాదం కల్తీ పాపం ఊరికే పోదని, భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన జగన్ ని ఆ దేవుడే శిక్షిస్తాడని జీవీ తెలిపారు. […]

ఏలూరులో వైసీపీ ప్రత్యేక పూజలు-కారణమిదేనట..!

టీటీడీ పవిత్రతను చంద్రబాబు మంటగలిపారని ఆరోపిస్తూ పాప ప్రక్షాళన కోసం ఇవాళ దేవాలయాల్లో ప్రత్యేక పూజలకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా దేవాలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. చంద్రబాబు పాపాలకు పరిహారం అంటూ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెబుతున్న వైసీపీ నేత కారుమూరి సునీల్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్

హిందువైతే రెడ్డి.. క్రిస్టియన్ అయితే జగన్-అలిపిరిలో సాధువుల డిమాండ్…!

తిరుమలకు జగన్ పర్యటన రద్దు నేపథ్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద సాధువులు, హిందూ సమాజం సభ్యులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. జగన్, నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా, అలాగే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తానంటే హిందువులను అగౌరపరిచినట్లే అన్నారు. జగన్మోహన్ రెడ్డి హిందువు అయితే రెడ్డి అని పెట్టుకోవాలని, క్రిస్టియన్ అయితే జగన్ అని పెట్టుకోవాలని,లేదంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు శ్రీ వెంకటేశ్వర స్వామి […]