తెలంగాణను గజగజ వణికిస్తున్న చలిపులి

మెగా9 వెబ్ డెస్క్ : చలికాలం ప్రారంభంలోనే జనం వణికిపోతున్నారు. తెలంగాణలో నాలుగు, ఐదు రోజులుగా వాతావరణంలో అనూహ్యంగా ఉష్ణోగ్రతలలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి.పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగమంచు కప్పేస్తోంది. పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత […]

పార్టీ ఉంది పుష్ప… గట్టిగానే!

మెగా9 వెబ్ డెస్క్ : బన్నీ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పుష్ప – 2 ట్రైలర్ ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది. యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో దూసుకుపోతున్న పుష్ప 2 ట్రైలర్ చూసి మూవీ టీం సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా, తాజాగా పుష్ప 2 ట్రైలర్ చూశాక “అద్భుతంగా ఉంది” అంటూ పుష్ప […]

కంగనా రనౌత్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్ వార్నింగ్

మెగా9 వెబ్ డెస్క్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..నటి కంగనా రౌనత్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. 2025 జనవరిలో విడుదల కానున్న ఎమర్జెన్సీ సినిమాపై భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. మంగళవారం గాంధీభవన్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నవారు ఇందిరా గాంధీ పై […]

ఏంటి ఆ వీడియోలో ఉంది సమంతానా?

మెగా9 వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత టీవీ యాడ్స్ లో కూడా యాడ్ చేసిందని మీకు తెలుసా ? అవును నిజమే సమంత కెరియర్ తొలినాళ్లలో చేసిన వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో సమంత బ్యూటీ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తుంది. ఎల్లో […]

వంటింట్లో ఉల్లి బాంబ్

మెగా9 వెబ్ డెస్క్ : ఎక్కడైనా ఉల్లి కోస్తే కన్నీళ్లు వస్తాయి కానీ ఇప్పుడు ఉల్లి ధర వింటే చాలు కళ్లెమట నీళ్లు తిరుగుతున్నాయి. ఆ రేంజ్ లో ఉన్నాయి ఉల్లి ధరలు. మొన్నటి వరకు సామాన్యుడికి టమాటా రేట్లు చుక్కలు చూపిస్తే ఇప్పుడు ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తులో ఉల్లి ధర ఉంది. కిలో ఉల్లి ధర 70 నుంచి 80 కి చేరింది. ఇప్పటికే కూరగాయల రేట్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సామాన్యుడికి […]

కారు నడుపుతూ సందడి చేసిన గులాబీ బాస్ కేసీఆర్

మెగా9 వెబ్ డెస్క్ : తెలంగాణలో అధికారం కోల్పోయాక పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్.. మాజీ సీఎం కెసిఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కారు డ్రైవింగ్ చేస్తూ సందడి చేశారు. ఆయన డ్రైవింగ్ చేస్తున్న కారులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డిని కూర్చోబెట్టుకున్నారు. ఇద్దరూ కలిసి పంట పొలాలను పరిశీలించారు. ఫామ్‌ హౌస్‌ లో జారిపడి తుంటి ఎముక విరగడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్న కేసీఆర్‌.. కోలుకున్న […]

మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ

మెగా9 న్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ లో ఈమధ్య కాలంలో దొంగతనాల కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ విచిత్రంగా ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న నేతల ఇళ్లను కూడా దొంగలు టార్గెట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో మంత్రి ఇంట్లో ఇప్పుడు దొంగలు పడినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాలకు వెళ్తే హైదరాబాద్ […]

వారం గ్యాప్ లో రెండు వరల్డ్ రికార్డులు-మెగా బ్రదర్స్ అరుదైన ఘనత..!

ఓ ఇంట్లో ఒకరు ఓ రికార్డు సాధిస్తేనే ఘనంగా చెప్పుకుంటాం. అదే వరల్డ్ రికార్డు సాధిస్తే తన చుట్టూ ఉన్న సమాజమే గొప్పగా చెప్పుకుంటుంది. అలాంటిది ఒకే ఇంట్లో పుట్టిన సోదరులు ఇద్దరూ వారం గ్యాప్ లో వరల్డ్ రికార్డులు అందుకుంటే.. అదీ వేర్వేరు రంగాల్లో ఇద్దరూ వాటిని అందుకుంటే.. ఆ ఊహే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదూ. కానీ దీన్ని నిజం చేసి చూపించారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ […]

అదీ లెక్కా…గిన్నిస్ బుక్‎లో మెగాస్టార్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది.వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటన, డ్యాన్స్​కుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ అవార్డు అందించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హోటల్​లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్​కు చిరంజీవి , కుటుంబీకులు, సన్నిహితులు పాల్గొన్నారు. అవార్డు అందుకునే సమయంలో హీరో సాయి ధరమ్ […]

100 రోజుల పాలనపై సోనూసూద్ కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో సీఎం చంద్రబాబు పాలనపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేసిందేమి లేదని వైసీపీ నుంచి విమర్శలొస్తుంటే.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్న క్యాంటిన్లు వంటి పథకాలను అమలు చేయడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న ఘనత తమ ప్రభుత్వానికి […]