మళ్లీ కెమెరా ముందుకు పవర్ స్టార్
గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీ బిజీగా గడిపిన పవన్ మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. ఈ నెల 23 నుంచి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ రీ స్టార్ట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నిక్ పోవెల్ తెరకెక్కించనున్నారు. గత నాలుగేళ్లుగా […]
మా మనోభావాలు దెబ్బతిన్నాయ్…పూర్తి విచారణ జరగాల్సిందే ; లడ్డూ ఎపిసోడ్ పై పండితులు
కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల లడ్డూ తయారీపై వస్తున్న వార్తలు ఉన్నాయన్నారు ప్రముఖ జ్యోతిష్యపండితులు శ్రీరామచంద్రమూర్తి. తిరుమలకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం వచ్చి స్వామివారిని సేవించుకుంటారని ఆయన గుర్తు చేశారు. ఇలా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో అపచారం జరిగిందన్న వార్తలు రావటం తమను కలిచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవటం ఒక్కటే మార్గమని చెబుతున్న శ్రీరామచంద్రమూర్తి.
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే లడ్డూ ఎపిసోడ్ ; వాసుపల్లి గణేష్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వందరోజుల పాలన కంటే వైసీపీ పాలనే బాగుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం వైసీపీ వైపే ఉండబోతోందని చెబుతున్న వాసుపల్లి గణేష్
చంద్రబాబు లడ్డూ స్కెచ్ అందుకే-అసలు రీజన్ చెప్పిన వైసీపీ ఎమ్మెల్సీ ..!
ఇటీవల వచ్చిన వరదలకు అమరావతి తడిసి ముద్దయిందని, అక్కడ రాజధాని నిర్మాణానికి అవకాశం లేదని, దీనిని పక్కదోవ పట్టించడానికి సీఎం చంద్రబాబు కొత్తరకం పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డులో కలిపే నెయ్యి జంతువుల కొవ్వు నుండి తీసిన నూనె అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది పచ్చి అబద్ధమని, ముఖ్యమంత్రి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ స్కెచ్ వేశారని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 100 రోజుల్లో […]
చంద్రబాబు లైట్ తీసుకున్నా, మేం వదిలిపెట్టం-షర్మిల వార్నింగ్..!
చంద్రబాబు తిరుమల లడ్డుపై సీఎం చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎసస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఇది చిన్న విషయం కాదని, సెంటిమెంట్ తో కూడిన అంశమన్నారు. ఈ విషయం ఇప్పుడే ఎందుకు బయట పెట్టారని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. దీని తీవ్రత ఆయనకు ముందే తెలుసా, తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదని అడిగారు. చంద్రబాబు 100 రోజుల పాలనపై ప్రజల అసంతృప్తి గమనించే, దాన్ని డైవర్ట్ చేసేందుకే ఇప్పుడు దీన్ని తెరపైకి […]
ఇంటర్ రద్దు వెనుక అసలు కారణమిదే..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థను రద్దు చేయనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా విద్య వ్యవస్థపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇంటర్ రద్దు, ఐదో తరగతి వరకు మాతృభాషలో బోధన.. వంటి కొత్త విధానాలను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తరగతుల విషయంలో కూడా కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. అయితే ఇంటర్ రద్దు చేయడం వెనుక […]
నా పాలసీ ఇదే – గుజరాత్ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ సదస్సులో చంద్రబాబు
ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తామని, సౌర, పవన హైబ్రిడ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై భేటీలో పాల్గొని ప్రసంగించారు. విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు, వీటి ద్వారా ఏపీకి పలు ప్రాజెక్టులు సాధించామని గుర్తు చేశారు. క్లీన్ […]
నిమజ్జనం వేళ ఖైరతాబాద్ వినాయకుడికి తగ్గని భక్తుల రద్దీ..!
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం కోసం భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. నిమజ్జనానికి సమయం దగ్గరపడుతుంటడంతో నిర్వాహకులు భక్తుల్ని అనుమతించడం లేదు. దీనిపై దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు కాస్త నిరుత్సాహానికి లోనవుతున్నారు. అయితే భారీ ఎత్తున సాగే మహాగణపతి నిమజ్జనం వేళ ఏర్పాట్లు చేయాలంటే ఆంక్షలు తప్పనిరని నిర్వాహకులు చెప్తున్నారు. దీనిపై భక్తులు ఏమంటున్నారో ఓసారి చూసేద్దాం..
కౌశిక్ రెడ్డి అస్త్రంతో బీఆర్ఎస్ బిగ్ వార్ ప్లాన్..!
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని రోజులుగా ప్రత్యర్దులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ కౌశిక్ రెడ్డి చేస్తున్న విమర్శలు, వాటికి పడుతున్న కౌంటర్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే ఇంత సడన్ గా కౌశిక్ రెడ్డి మాటల దాడి చేయడం వెనుక ఏముంది ? ఈ దూకుడుతో కౌశిక్ రెడ్డి కానీ, ఆయన పార్టీ బీఆర్ఎస్ కానీ ఏం ఆశిస్తున్నాయి తెలియాలంటే […]