ఆ డెడికేషన్, ఆ అటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సర్:మెగాస్టార్ పోస్ట్ కు బుచ్చిబాబు రిప్లై

Spread the love

 రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా నుండి తాజాగా సెకండ్ సింగిల్ రిలీజై సోషల్ మీడియాలో అదరగొట్టేస్తోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సాంగ్, రామ్ చరణ్ డ్యాన్స్ పై ప్రశంసలు కురిపించారు.   సినిమాలోని #RaiRaiRaaRaa సాంగ్ వెండితెరపై ఒక వైబ్రేషన్. ఎనర్జీ, ఎమోషన్ మరియు సినిమాటిక్ అద్భుతాల కలయికతో ఈ పాట అదరగొట్టింది. చరణ్ తనదైన శైలిలో, మెరుపు వేగంతో స్క్రీన్ పై కనిపిస్తుంటే చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.తన మూమెంట్స్ కనువిందుగా ఉన్నాయి. ఈ అద్భుతమైన చిత్రీకరణకు దర్శకుడు బుచ్చిబాబుకి, మంత్రముగ్ధులను చేసే సంగీతం మరియు గాత్రం అందించిన రెహమాన్  గారికి, మరియు పవర్-ప్యాక్డ్ కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ కి అభినందనలు అని పేర్కొన్నారు. అలాగే 

అద్భుతమైన విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, అర్థవంతమైన సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్ నిర్మాత వెంకట సతీష్ కిలారు లకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు. ఈ టీమ్ మరెన్నో మైలురాళ్ళను అందుకోవాలని ఆకాంక్షించారు. దీనికి డైరెక్టర్ బుచ్చిబాబు బదులిచ్చారు. Thank you sooo much Sirrrr ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సర్, ఈ బీజీఎమ్ షూటింగ్ చేస్తున్నప్పుడు చరణ్ సర్‌కి హై ఫీవర్ మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన “లేదు చేద్దాం” అన్నారు. అంత జ్వరం లో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు. ఆ డెడికేషన్, ఆ అటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సర్ అంటూ పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *