వెండితెరపై ఆవిష్కృతమవుతున్న దేశభక్తి నేపథ్యంలో వస్తున్న కథలు కేవలం వినోదం కోసం తీసినవి కావు; మన నేలతల్లి స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల గుండెచప్పుడు. తుపాకుల మోతలు, నెత్తుటి ధారల వెనుక ఉన్న నిస్వార్థ ప్రేమను, ఈ దేశం మీద వారికున్న అంకితభావాన్ని ఈ సినిమాలు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. అలుపెరగని పోరాటాలు, కన్నీటి ఘట్టాలు, మరియు దేశభక్తి కలగలిసిన ఈ శక్తివంతమైన కథనాలు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయతను రగిలిస్తాయి.
ప్రభాస్ FAUJI…
పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల్లో ఉన్న ఒక గర్వకారణమైన ప్రాజెక్ట్ ఇది. ‘Sita Ramam’ సినిమాతో మనల్ని భావోద్వేగంగా టచ్ చేసిన హను రాఘవపూడి, ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి ఒక పీరియడ్ వార్ డ్రామా తీస్తున్నారు. ఇందులో ప్రభాస్, ఒక సైనికుడిగా కనిపించబోతున్నాడు. భారత భూభాగాన్ని కాపాడే యోధుడిగా ఆయన పాత్ర ఊహించుకోవడమే goosebumps తెప్పించేదిగా ఉంది. సినిమా 2026 december లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటినుంచే ఈ సినిమాపై expectations మొదలయ్యాయి. ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది…
సన్నీ డియోల్ – ఆమిర్ ఖాన్ ల – Lahore 1947 :
రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం – దేశ విభజన సమయంలో ఇద్దరు వ్యక్తుల కథ. సన్నీ డియోల్ వంటి మాస్ స్టార్, ఆమిర్ ఖాన్ వంటి perfectionist కలిసి మన చరిత్రలోని ఓ విషాదకావ్యాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ సినిమా కేవలం దేశాల మధ్య సరిహద్దులే కాదు, మనుషుల మధ్య బంధాలే ఎలా విరిగిపోయాయో చూపిస్తుంది.
బ్లడ్ తో నిండిన ఓ కాలం, గుండెల్ని పిండి వేసే ఓ కథ ఇది… ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది.
సల్మాన్ ఖాన్ Battle of గాల్వాన్:
ఇటీవల కాలంలో చర్చకు వస్తున్న గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఇండో-చైనా యుద్ధానికి సంబంధించిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తుండగా, చిత్రాంగద సింగ్ కథానాయికగా కనిపించనుంది. దేశాన్ని రక్షించడానికి సైనికులు చూపించిన ధైర్యాన్ని వీక్షించేలా చేసిన ఈ సినిమా, భావోద్వేగాలతో నిండిన యుద్ధ గాథగా ఉంటుందని టాక్.
అడివి శేష్ Goodachari 2 :
గూఢచారి సినిమాలో గోపీ 116గా షాక్ ఇచ్చిన అడివి శేష్ ఇప్పుడు గూఢచారి 2తో తిరిగి రాబోతున్నాడు. ఈసారి వినయ్ సింగిరెడ్డి దర్శకత్వంలో కథ మరింత ఇంటర్నేషనల్ స్కేల్లో రూపొందుతోంది. దేశ భద్రత కోసం ఎదుర్కొనే ముప్పులు, అంతర్జాతీయ మాఫియా వ్యవహారాల నేపథ్యంలో హై టెక్ యాక్షన్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు 2026లో రానుంది.
కార్తీ Sardar 2 :
సర్దార్ సినిమాలో జేమ్స్ బాండ్ తరహాలో తండ్రిగా కార్తీ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే కథను మరో మెట్టుపైకి తీసుకెళ్తున్న దర్శకుడు PS మిత్రన్, సర్దార్ 2ని దీపావళికి విడుదల చేస్తున్నాడు. ఇందులో కార్తీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు – తండ్రి ఒక గూఢచారి, కుమారుడు పోలీస్ ఆఫీసర్. రాజకీయ కుట్రలు, దేశ వ్యతిరేక శక్తులపై చేసే పోరాటం కథలో కీలకం.ఇలా ఈ నేపథ్యంలో ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.