కరోనా కంటే డేంజరస్…మరోసారి లాక్‌డౌన్..!

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కనుమరుగవుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలోపే మరో మహమ్మారి.. మంకీపాక్స్‌ ప్రజల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది. దాదాపు వంద దేశాలకు ఈ మాయదారి మహమ్మారి విస్తరించింది. ఇప్పటికే ఆఫ్రికన్, యూరోపియన్ దేశాలను హడలెత్తించిన ఈ మంకీపాక్స్‌ ఇప్పుడు భారత్‌లోనూ అలజడి రేపుతోంది. దేశంలో మంకీపాక్స్ కేసు నమోదు కాడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కరోనా కంటే ఈ వైరస్ వెరీ డేంజరస్ అని శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వ్యాధి లక్షణాలు, ఇన్‌ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మంకీపాక్స్ మహమ్మారి తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి రీసెంట్ గా ఇండియాకు వచ్చిన ఒక యువకుడికి మంకీపాక్స్ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ లో Mpox అనుమానిత కేసుగా గుర్తించిన అధికారులు..అతడిని ఐసోలేషన్ కు తరలించి, రక్త నమూనాలను సేకరించి ఎంపాక్స్‌ నిర్ధారణ కోసం ల్యాబ్ కు పంపించగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భవిష్యత్తులో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తోంది.

వాస్తవానికి కరోనా కంటే మంకీపాక్స్ చాలా డేంజర్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంకీపాక్స్ దేశాల సరిహద్దులు దాటి ప్రపంచం అంతటా వ్యాపిస్తోందని గుర్తించారు. మంకీపాక్స్‌ వైరస్ ఒకరి నుంచి వేరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఫ్లూ వంటి లక్షణాలు, చీముతో కూడిన గాయాలకు కారణమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి సోకిన వ్యక్తి మరణించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

1970లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మనుషుల్లో మొదటిసారిగా మంకీపాక్స్‌ని గుర్తించారు శాస్త్రవేత్తలు. క్రమంగా ఈ వైరస్ 2022 నాటికి ప్రపంచంలో ఉన్న సుమారు వందకు పైగా దేశాలకు వ్యాపించింది. ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులు గుర్తించారు. సాధారణంగా మంకీపాక్స్ కోతులు, ఎలుకలు, ఉడుతల వంటి జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు కొంచెం తక్కువే …అయినా సరే.. చర్మం పగుళ్లు, శ్వాసకోశ వ్యవస్థ, కళ్లు, నోటి ద్వారా ఇది సంక్రమిస్తుంది.

మంకీపాక్స్ సోకిన వ్యక్తుల్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి వంటివి కనిపిస్తాయి. రెండు నుంచి మూడు వారాల్లో శరీరం మొత్తం దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లు ముఖం, అరచేతులు, అరికాళ్లు, కళ్లు, నోరు, గొంతు వంటి ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. మీకు మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్నాయని భావిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, అవసరమైన అన్ని భద్రతా చర్యలను తీసుకోవడం ద్వారా మంకీపాక్స్‌ సంక్రమణ, వ్యాప్తిని బాగా తగ్గించవచ్చు. సబ్బు, హ్యాండ్‌ శానిటైజర్‌తో తరచుగా చేతులు కడుక్కోవాలి. శానిటైజేషన కోసం క్రిమిసంహారకాలను ఉపయోగించాలి. కడగని చేతులతో ముఖాన్ని, కళ్ళు, ముక్కు, నోటిని తాకకూడదు. మంకీపాక్స్‌ సోకిన వ్యక్తులతో సోషల్‌ డిస్టెన్స్ పాటించాలి. జ్వరం, దద్దుర్లు లేదా వాపు వంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. రద్దీ ప్రాంతాల్లో గ్లౌజులు, మాస్కులు ధరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కంట్రోల్‌ చేయవచ్చు. పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలి. వాటిని ముట్టుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు పాటించండి ద్వారా మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్నవారిని మంకీపాక్స్‌ నుండి రక్షించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *