4 లక్షలు ఖర్చుచేసి కారుకి అంత్యక్రియలు చేసిన కుటుంబం.. ఎందుకంటే ?

మెగా9 న్యూస్, వెబ్ డెస్క్ :మనుషులకు, మూగజీవాలకు అంత్యక్రియలు చేసే తంతు చూసే ఉంటాం. కానీ వాహనాలకు అంత్యక్రియలు చేయడం ఎప్పుడైనా చూసారా ? వాహనాలకి అంత్యక్రియలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా.. అవును ఇది నిజమే గుజరాత్ లోని అమెరికి జిల్లాలో ఒక కుటుంబం కారుకి 4 లక్షలు ఖర్చుచేసి మరి అంత్యక్రియలు చేసింది. ఈ అంత్యక్రియలకు దాదాపు 1,500 మంది తరలివచ్చారంట ..ఇంతకీ కారు కి అంత్యక్రియలు ఏంటి ? ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం .


ప్రతి ఒక్కరికి ఎదో ఒక వస్తువు పట్ల అభిమానం ఉంటుంది. ఆ వస్తువుతో భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉంటారు. అలాంటి ఉదాహరణ ఒకటి గుజరాత్‌లో వెలుగు చూసింది. అమ్రేలి జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబం తమ పాత కారును స్క్రాప్ చేయకూడదనుకున్నారు. అయితే తమకు అమితంగా ఇష్టమైన కారును అమ్మకుండా మనుషుల్లాగే సమాధి చేసి ఔరా అనిపించారు..!

తన 12 ఏళ్ల వ్యాగన్ ఆర్ కారుకు పూర్తి ఆచార వ్యవహారాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విందు ఏర్పాటుకు నాలుగు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశాడు. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా లాథి తాలూకాలోని పదర్‌శింగ గ్రామానికి చెందిన ‘సంజయ్ పొల్లారా అతని కుటుంబం’ నవంబర్ 9న తమ పాత కారును తమ పొలంలో పాతిపెట్టి, సమాధి కట్టించారు. ఆ కుటుంబం 12 ఏళ్లుగా కారుతో ఉన్న అనుబంధాన్ని మరువలేకపోయారు. దానిని స్క్రాప్ కోసం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీంతో కుటుంబ సభ్యులు కారును సమాధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నాలుగు లక్షల రూపాయలు వెచ్చించారు.

మత సంప్రదాయాలను అనుసరించి సాధువులతో పాటు సుమారు 1500 మందికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. “పోలారా కుటుంబం” వారి 12 ఏళ్ల వ్యాగన్ ఆర్ కారు కోసం సమాధి చేయడానికి 15 అడుగుల లోతైన గొయ్యిని తవ్వారు. అంతిమ వీడ్కోలు సందర్భంగా కారుకు పచ్చని గుడ్డ కప్పి పూలమాలలు వేసి అలంకరించారు. మతపరమైన ఆచారాల మధ్య అర్చకులు కారుపై గులాబీ రేకులు చల్లి మంత్రోచ్ఛారణలు చేశారు. చివరికి కారును ఎక్స్‌కవేటర్ మెషిన్ సాయంతో గుంతలోకి తీసుకెళ్లి మట్టిని పడేసి సమాధి చేశారు. కుటుంబానికి ఈ కారు ఎంతో అదృష్టమని, భవిష్యత్ తరాలకు భద్రపరిచేందుకే ఈ ప్రయత్నమన్నారు కుటుంబసభ్యులు.

పోలారా కుటుంబం ఈ కారును 12 సంవత్సరాల క్రితం కొన్నారు. అది రాగానే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిశాయి అని వ్యాపారంలో విజయం, కుటుంబానికి గొప్ప గౌరవం. సూరత్‌ లో నిర్మాణరంగం స్థిరపడ్డారు అని అందువల్ల, పోలారా కుటుంబం తమకు కలిసి వచ్చిన ఈ కారు కి హిందూ ఆచారాల ప్రకారం అంతక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ వేడుకకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసామని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కారు సమాధిపై కూడా చెట్టును నాటాలని ఆలోచిస్తున్నాం..తద్వారా భవిష్యత్ తరాలు ఈ అదృష్ట కారు నీడలో కూర్చోవచ్చని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *