నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పని దినాలను పెంచాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలు ఇచ్చారు. కలిగిరి మండలం వెలగపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణఉపాధి హామీ పథకములో భాగంగా నిర్మిస్తున్న మినీ గోకులం గేదెల షెడ్డు నిర్మాణ పనులను ఆయన తనిఖీ చేశారు. మెట్ట ప్రాంత రైతులకు ఉపాధి హామీ పథకం ఓ వరం లాంటిదని , ఇలాంటి పథకాన్ని అందరూ పేద రైతులు ఉపయోగించుకొని లబ్ధి పొందాలని ఆయన కోరారు.