నెల్లూరు జిల్లాలో మద్యం షాపులకి సంబంధించి లక్కీ డ్రా కార్యక్రమం జోరుగా సాగింది.మొత్తం 182 షాపులకు గాను 3890 దరఖాస్తులు వచ్చాయి. నెల్లూరు జిల్లా నుండి ప్రభుత్వ ఖజానాకు దాదాపు 18 కోట్లు ఆదాయం సమకూరింది. ఉదయం నుండి భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో లక్కీ డ్రిప్ కార్యక్రమం కొనసాగింది. అయితే ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల ఫీజు పెట్టడం పట్ల దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా 2 లక్షల రూపాయలు ఫీజు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది మంది 10 షాపులుకు కూడా దరఖాస్తుల పెట్టుకున్నారని వాళ్లకు ఒక షాపు కూడా రాలేదని అంటే 20 లక్షలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలోని లక్కీ డ్రీప్ తీసే కస్తూరిబా కళాక్షేత్రం నుండి మా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి మరింత సమాచారం అందిస్తారు.