ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ద రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా పడుతున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. ఒంగోలు నగరంలో రోడ్లపైకి నీరు చేరింది. భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రకాశం జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ తమీమ్ ఆన్సరియా…భారీ వర్షానికి లోతోట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రంలోకి మత్సకారుల చేపల వేట నిషేధించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం లో ప్రజలు 1077 ఆర్టీవో కార్యాలయంలో 9281034437,9281034441 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.