: ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపొయింది

 Devarakonda : ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవకొండ(Vijay Devarakonda) పరుశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుంచి రిలీజైన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘ఐరనే వంచాలా ఏంటి‘ అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియా(Social Media) లో కూడా ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరుశురాం- విజయ్ కాంబో మరో సారి రిపీట్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ అభిమానులకు సూపర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్

తాజాగా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఖరారు చేశారు. “బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ బొనాంజా #ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది” అంటూ ట్వీట్(X) చేశారు మేకర్స్ . ఈ సందర్భంగా సినిమా పోస్టర్ ను కూడా షేర్ చేశారు. ఇందులో విజయ్ లుంగీ కట్టుకొని.. భుజాల మీద సంచి వేసుకొని మధ్యతరగతి ఫ్యామిలీ మెన్ గా కనిపించారు. దీంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. ఫ్యామిలీ, మాస్ యాక్షన్ కథాంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ పాత్ర సరికొత్తగా ఉండబోతున్నట్లు చెబుతున్నారు. విజయ్ సరసన టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కథానాయికగా నటిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. త్వరలోనే మూవీ ప్రమోషన్స్ కూడా మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *