బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా డ్రైనేజీలన్ని పొంగిపొర్లుతున్నాయి.ముందు జాగ్రత్తగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు. ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో అకాల వర్షం వల్ల తాజా పరిస్థితి ఎలా ఉందో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు..