భీమవరం సీతయ్య పలావ్-రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు..!

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సీతయ్య పలావ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆకలితో ఉన్న ప్రతి వాడి కడుపు నింపాలని ఆలోచనతో సీతయ్య పెట్టిన హోటల్ అది. సీతయ్య పలావ్ సెంటర్లో సీతయ్య పలావును స్వయంగా తన స్వహస్తాలతో తయారుచేస్తారు. భీమవరం పట్టణం చుట్టుపక్కల గ్రామాల నుంచి రోజు పట్టణానికి ఏదో పనిమీద గ్రామాల వారు వస్తుంటారు. కానీ సీతయ్య పలావు తినకుండా మాత్రం ఎవరు ఊరు దాటరని పేరు.

భీమవరం సీతయ్య పలావుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంతో రుచికరంగా ఉండే ఈ పలావుకు అందరూ అభిమానులే. తక్కువ రేటులో లభించే సీతయ్య పలావు ఓసారి తింటే చాలు అన్నట్లు ఉంటుంది దీని వ్యవహారం. ఆకుకూరల భోజనం కన్నా తక్కు రేటులోనే దొరికే ఈ పలావుకు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో మంచి పేరుంది. సీతయ్య పలావ్ సెంటర్ ప్రారంభ దశలో ప్లేట్ పలావ్ ఒక మనిషికి సరిపడినంత చికెన్ కర్రీ వేసి ఒక గుడ్డుతో 30 రూపాయలకు ఇచ్చేవారు. కాలక్రమేణ అది ఇప్పుడు 80 రూపాయలకు చేరుకుంది.

ప్రస్తుత రోజుల్లో ఓ చిన్న హోటల్ కు వెళ్లి వైట్ రైస్ భోజనం తినాలన్నా వంద రూపాయలు పైనే ఉంటుంది. కానీ సీతయ్య పలావు సెంటర్లో 80 రూపాయల నుండే ప్రారంభం. అలా అని తక్కువ ధరకు నాణ్యత లేకుండా ఉండే సమస్యే లేదు. సీతయ్య పలావు తయారీలో దేనికీ రాజీపడడు. సీతయ్య ఎవడి మాట వినడు అన్నట్లు ఈ పలావు తయారీలో ఆయన దేనికీ రాజీ పడడని పేరుంది. పలావు వండటానికి పుల్లల పొయ్యిని వెలిగించే దగ్గర నుండి, వడ్డించే వరకు మొత్తం తన స్వహస్తాలతో చేస్తారు సీతయ్య. అలాగే బిర్యానీలో వాడే రైస్ ఎటువంటి కల్తీ లేకుండా సీతయ్యే వెళ్లి తెస్తారు. ఇప్పటికీ బయట సూపర్ మార్కెట్లో ప్యాకింగ్ చేసి మసాలాలను ఇస్తుంటే సీతయ్య మాత్రం మసాలా దినుసులను సొంతగా తయారు చేసే వాడతారు.

అలా ప్రతిదీ ఆయనే దగ్గరుండి సహజ సిద్ధంగా తయారు చేసి వాడటం వల్ల భీమవరంలోని సీతయ్య పలావుకు అంత పేరు వచ్చింది. తన పేరుని బ్రాండ్ గా మార్చుకోవడమే కాదు ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తూ పని వారిని కూడా తన సొంత వారిలా చూసుకుంటారనే పేరు సీతయ్యకి ఉంది. ఆరోగ్యపరంగా మసాలాలతో కూడిన బిర్యానీ తింటే వేడి చేస్తుందని అంటూ ఉంటారు కానీ సీతయ్య బిర్యాని రోజు తిన్న వేడి చేయదని ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని అక్కడ ప్రజలు చెబుతారు. కాబట్టి ఈసారి భీమవరం వెళ్ళినప్పుడు మన సీతయ్య పలావు టేస్ట్ తప్పకుండా చూసేయండి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *