మోక్షజ్ఞకు ఎన్టీఆర్ ట్వీట్ వెనుక పాన్ ఇండియా లెక్క…!

యువరత్న నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమవుతున్నాడు. దీంతో తన పుట్టినరోజు సందర్బంగా ఓ స్టిల్ ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీన్ని స్వాగతిస్తూ ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ అందరి కంటే ముందు రియాక్ట్ అయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మోక్షును ఆహ్వానిస్తూ ఓ ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు. అయితే ఇది సాదాసీదాగా పెట్టిన మెసేజ్ మాత్రం కాదన్నది ఇండస్ట్రీ టాక్. దీంతో ఎన్టీఆర్ మెసేజ్ వెనుక అసలు కారణాలపై చర్చ జరుగుతోంది.

నందమూరి హీరో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ త్వరలో తెరంగేట్రం చేయబోతున్నాడు. కొన్నేళ్లుగా సినీ ఎంట్రీ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నా సరైన సమయం రాలేదు. కానీ ఇప్పుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. దీంతో తన తాజా స్టిల్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మోక్షు ఎంట్రీని స్వాగతిస్తూ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ కూడా ట్వీట్లు పెట్టారు. ఇందులో జూనియర్ ట్వీట్ మరీ ప్రత్యేకం.

కొన్నేళ్లుగా తన వ్యవహారశైలితో ఇటు టీడీపీకి, అటు నందమూరి, నారా కుటుంబాలకు సైతం ఎన్టీఆర్ దూరమయ్యారు. 2009లో టీడీపీకి ప్రచారం చేశాక వచ్చిన రెస్పాన్స్ తర్వాత ఆ పార్టీలో చేరిపోతాడని భావించిన ఎన్టీఆర్ ను చంద్రబాబే వ్యూహాత్మకంగా దూరం పెట్టారన్న ప్రచారం జరిగింది. ఇంకా చెప్పాలంటే తన కుమారుడు లోకేష్ కు పోటీ రాకుండా ఎన్టీఆర్ ను తన సోదరి మనవరాలికి ఇచ్చి చంద్రబాబు పెళ్లి చేయించారని కూడా చెబుతుంటారు. అయితే ఈ కారణమూ మరేదైనా కారణమూ తెలియదు కానీ జూనియర్ పూర్తిగా రాజకీయాలకు దూరమైపోయాడు. అంతే కాదు టీడీపీకీ, నారా, నందమూరి కుటంబాలకు దూరంగా ఉంటున్నాడు. దీంతో భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పుడు కానీ, చంద్రబాబు అరెస్టు సమయంలో కానీ స్పందించలేదు. దీంతో ఆ గ్యాప్ మరింత పెరిగిపోయింది.

కానీ ఎన్టీఆర్ వ్యూహాలు వేరే ఉన్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా తెచ్చిపెట్టిన విజయంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఎన్టీఆర్.. తాజాగా బెంగళూరు వెళ్లి రిషబ్ శెట్టిని కలిశాడు. దేవర సినిమాను సైతం పాన్ ఇండియాలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్ధితుల్లో కెరీర్ కు ఎలాంటి సమస్యా లేకుండా చూసుకోవాలని ఇండస్ట్రీలో సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తన పాన్ ఇండియా టార్గెట్ అందుకునే క్రమంలో ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యూహాత్మకంగా మోక్షజ్ఞకు ఎన్టీఆర్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నందమూరి, నారా కుటుంబాలకు తిరిగి దగ్గరయ్యేందుకు ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే టాలీవుడ్ లో ఇతర హీరోల కంటే ముందు మోక్షజ్ఞ ట్వీట్ కు ఎన్టీఆర్ రెస్పాండ్ అయినట్లు సమాచారం. మొత్తంగా ఎన్టీఆర్ స్ట్రాటజీ ఏదైనప్పటికీ…ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎన్టీయార్..తన కెరీర్ లో మరో మెట్టు ఎక్కబోతున్నారు. రిలీజ్ కి ముందే పలు రికార్డులను సొంతం చేసుకుంటున్న ఈ దేవర..టాలివుడ్ కి వరల్డ్ వైడ్ గా మరింత క్రేజ్ తీసుకొస్తారని ఆశిద్దాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *