విస్తీర్ణం పరంగా అతి పెద్దదైన దేశం ఏదంటే రష్యా అని ఎవరైనా టక్కున సమాధానం చెబుతారు. ఈ దేశం యొక్క విస్తీర్ణం 17.1 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మరి ఇంత పెద్దదైన దేశంలో.. ఉండే జనాభా ఎంతో తెలుసా..? 2023 గణాంకాల ప్రకారం 14.38 కోట్లు మాత్రమే. అంటే విస్తీర్ణంతో పోల్చితే ఆ దేశంలో నివసించే జనాభా చాల అంటే చాల తక్కువ. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే విస్తీర్ణం పరంగా రష్యా దరిదాపుల్లో కూడా లేని బాంగ్లాదేశ్.. జనాభాలో మాత్రం గట్టి పోటీ ఇస్తోంది. బంగ్లాదేశ్ విస్తీర్ణం 1.48 లక్షల కిలోమీటర్లు కాగా.. జనాభాలో మాత్రం రష్యాను మించింది. 2023 గణాంకాల ప్రకారం బంగ్లాదేశ్ జనాభా 17.3 కోట్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే రష్యా కంటే బాంగ్లాదేశ్ లో మూడు కోట్ల మంది అధికంగా నివసిస్తున్నారు. దీని బట్టి రష్యాలోని చాలా ప్రాంతం ఎడారి అడవులతో కప్పబడి ఉన్నట్లు యిట్టె అర్థమౌతుంది. అందుకే ప్రపంచంలోని వివిధ రకాల వన్యప్రాణులకు రష్యా నిలయంగా ఉంది.