ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాటలు విడ్డూరంగా ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జగన్ హయాంలో జరిగిన దాడుల్ని గుర్తుచేశారు. అత్యాచారాలపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు. జగన్ హయాంలో 8 గంటలకు ఒక అత్యాచారం జరిగిందని తెలిపారు. షర్మిలపై పోస్టులు పెడుతున్నా జగన్ చలించలేదని అనిత ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులను పని చేయనివ్వలేదని, మేం చేస్తున్న అరెస్టులు తప్పు కాదు.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అని జగన్ ను ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ప్రచారంపై ఉగ్రవాదుల కంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకోవాలన్నారు.