ఆర్థిక లావాదేవీల గొడవతో రాజమండ్రిలో ఓ వైసీపీ నాయకుడు ఈవెంట్స్ యాంకర్ పై దాడికి పాల్పడ్డాడు. హైదరాబాదులో ఉంటున్న విజయవాడకు చెందిన కావ్య శ్రీ అనే ఈవెంట్స్ యాంకర్ కు రాజమండ్రి వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్ వి శ్రీనివాస్ 2021వ సంవత్సరం నుంచి 3 లక్షల రూపాయలు అప్పు చెల్లించాల్సి ఉంది. అనేకసార్లు తమను తిప్పుతున్న ఎన్ వి శ్రీనివాస్ ఇంటికి నిన్న కావ్య శ్రీ… తండ్రి నాగరాజుతో పాటు వెళ్లింది. ఈ క్రమంలో వైసీపీ నాయకుడు శ్రీనివాస్ వారిపై తీవ్రంగా దాడి చేశాడు. బాధితులు రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.