రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో పూర్తి బడ్జెట్ఓ కాకుండా.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది ఏపీ సర్కార్. కొన్ని సమస్యలు అసెంబ్లీలో చర్చ కోసం పది రోజులు అసెంబ్లీ జరపాలని టీడీపీ అంటుంది. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ప్రస్తుతం మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. 

ALSO READ: కేసీఆర్ దుర్మార్గుడు… చేసిన పాపాలకు లెక్కలు లేవు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం..

* మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌
* 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం
* వైఎస్సార్‌ చేయూత 4వ విడతకు ఆమోదం


* ఫిబ్రవరిలో వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం
* ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్‌ సిగ్నల్‌
* ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం
* ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం
* ఎస్‌ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్‌ ఆమోదం
* యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు
* అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
* నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులకు ఆమోదం
* శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
* ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్‌ పోస్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
* ఆ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్‌ ఆమోదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *