కేసీఆర్‌, హరీశ్‌రావుకుహైకోర్టులో బిగ్ రిలీఫ్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు లకు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్‌ చేసింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగా లేవని న్యాయమూర్తి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టింది. దీనిని సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా కోర్టులో పిటిషన్‌ వేసిన రాజలింగమూర్తికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.

big relief to brs harish rao

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందని భూపాలపల్లి కోర్టులో రాజలింగంమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ ఏడాది జులై 10న కేసీఆర్, హరీష్ రావు కు నోటీసులు పంపింది. ఈ కేసును కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ రావు డిసెంబర్ 23న తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కోర్టుకు రివిజన్ పిటిషన్ ను స్వీకరించే అధికార పరిధి లేకపోవడంతో ఈ పిటిషన్ ను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. మేజిస్ట్రేట్ కోర్టు తనకు పరిధి లేదని ప్రైవేట్ కంప్లైంట్‏ను కొట్టేసిన తర్వాత రివిజన్ పిటిషన్ విచారణకు స్వీకరించి ప్రైవేట్ ఫిర్యాదును తిరిగి తెరిచే అధికారం జిల్లా కోర్టుకు లేదని కేసీఆర్ , హరీష్ రావు తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు విన్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *