వైసిపి నేతలు శిల్పా రవి, రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి రాంగ్ డైరెక్షన్.
వైసిపి నేతల ట్రాప్ లో పడి జీరో అయిన హీరో.
దమ్ముంటే పట్టుకోరా షికావత్తు… పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అంటూ పుష్ప – 2 లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ గుర్తుందా? అదంతా సినిమాలో బాగుంటుంది. కానీ నిజ జీవితంలో ఎంత పెద్ద తోపైనా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. సినిమా రిలీజ్ సందర్భంగా మహిళ చనిపోవడం ఆమె కుమారుడు మృత్యువుతో పోరాడటం అంతా మనకి తెలిసిందే. గతంలో కూడా అనేక సందర్భాల్లో తొక్కిసలాటలు జరగడం, చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహార శైలి దేశవ్యాప్తంగా సంచలనం ఎందుకు అవుతుంది. హీరో గారిని రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తుంది ఎవరు? అల్లు ఫ్యామిలీ కి అత్యంత దగ్గర గా ఉండే వ్యక్తులు, అల్లు అర్జున్ ఫ్రెండ్స్ ప్రస్తుత సంక్షోభం గురించి ఏమంటున్నారు? ముఖ్యమంత్రి అసెంబ్లీ స్టేట్మెంట్ తరువాత సైలెంట్ గా ఉండమని సన్నిహితులు, శ్రేయోభిలాషులు అల్లు అర్జున్ కి సలహా ఇచ్చారు. కానీ ఉన్నట్టుండి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కి రావడం ఆ తర్వాత పోలీసులు ఆధారాలతో సహా వివరాలు బయటపెట్టడం హీరో ఇమేజ్ ను నేషనల్ వైడ్ దెబ్బతీశాయి. చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించొద్దు అని చెప్పిన అడ్వకేట్ మరెవరో కాదు వైసిపి రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి.

ఇప్పటి వరకూ దేశ చరిత్ర లో లేని కొత్త భాష్యం ఆయన చెప్పడం దానికి అల్లు అర్జున్ తల ఆడించడం జరిగిన అనర్థాలకు కారణం. కేసు ఉంటే చనిపోయిన వ్యక్తి ఇంటికెళ్ళి పరామర్శించకూడదు, చావుబ్రతుకుల మధ్య ఉన్న కుర్రాడిని చూడటానికి కూడా వెళ్ళకూడదు అని నిరంజన్ రెడ్డి చెప్పడం న్యాయకోవిదులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా రిలీజ్ రోజు 9.40 కి శిల్పా రవి కూడా సంద్యా ధియేటర్ కు వెళ్లారు. అక్కడ వారిద్దరి మధ్య జరిగిన చర్చలు ఎంటి అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అంతే కాకుండా ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టమని శిల్పా రవి చెప్పడం గుడ్డిగా దానిని హీరో గారు నమ్మడం కూడా ప్రస్తుత పరిస్థితి కి కారణం అని అల్లు కాంపౌండ్ టాక్. అల్లు అర్జున్ ను ఒక్క రోజు లోనే బయటకు రావడానికి నిజంగానే ప్రభుత్వం సహకరించింది. సినీ పెద్దలు కోరిక మేరకు సిఎం ఒక్క అడుగు వెనక్కి వేసి బెయిల్ రావడానికి సహకరించారు అనేది బహిరంగ సత్యమే. అక్కడితో సమసిపోయింది అనుకున్న సమస్యను అల్లు అర్జున్ మళ్ళీ దేశ వ్యాప్త చర్చ జరిగే స్థాయికి తేవడం వెనుక వైసిపి నేతల హస్తం ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ నేతల నుండి వస్తున్న డైరెక్షన్ ప్రకారం అల్లు అర్జున్ ను పావుగా వాడుకొని తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద జల్లడం, సినీ ఇండస్ట్రీ ను ప్రభుత్వానికి వ్యతిరేకం చేసే కుట్ర లో భాగంగా కేటీఆర్ ఆదేశాల మేరకు శిల్పా రవి, నిరంజన్ రెడ్డి ను వైసిపి అధిష్ఠానం పావులుగా వాడుకుంటుదని అల్లు కాంపౌండ్ గుసగుసలు. అంతా తెలిసినా హీరో గారికి చెప్పే ధైర్యం చెయ్యలేక జరుగుతున్న నష్టాన్ని చూసి తట్టుకోలేక అల్లు అర్జున్ సన్నిహితులు తర్జనభర్జన పడుతున్నారు.